Yasmin Banu : యాస్మిన్ భానుకి ఏమైంది? 3 నెలల క్రితం ప్రేమ పెళ్లి చేసుకున్న యువతి అనుమానాస్పద మృతి..

తండ్రి అనారోగ్యానికి గురయ్యాడంటూ యాస్మిన్ ను పిలిపించుకున్న తల్లిదండ్రులు.. ఆ వెంటనే యాస్మిన్ భాను చనిపోయిందంటూ సాయితేజకు చెప్పారు.

Yasmin Banu : యాస్మిన్ భానుకి ఏమైంది? 3 నెలల క్రితం ప్రేమ పెళ్లి చేసుకున్న యువతి అనుమానాస్పద మృతి..

Updated On : April 14, 2025 / 9:44 PM IST

Yasmin Banu : అనుమానాస్పద రీతిలో యువతి మృతి చెందిన ఘటన చిత్తూరు జిల్లా మసీదు మిట్టలో చోటు చేసుకుంది. పరువు హత్యగా అనునాలు వ్యక్తమవుతున్నాయి. చిత్తూరుకు చెందిన యాస్మిన్ భానును 3 నెలల క్రితం పూతలపట్టుకు చెందిన సాయితేజ ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. ఫిబ్రవరి 9న నెల్లూరులో పెళ్లి చేసుకున్న వీరిద్దరూ ఆత్మరక్షణ కోసం తిరుపతి పోలీసులను ఆశ్రయించారు.

ఇద్దరూ మేజర్లు కావడంతో యాస్మిన్ భాను తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చిన తల్లిదండ్రులు.. యవతిని సాయితేజ వెంట పంపించారు. నిన్న యువతి తండ్రి అనారోగ్యానికి గురయ్యాడంటూ యాస్మిన్ ను పిలిపించుకున్న తల్లిదండ్రులు.. ఆ వెంటనే యాస్మిన్ భాను చనిపోయిందంటూ సాయితేజకు చెప్పారు. యాస్మిన్ ను ఆమె తల్లిదండ్రులే హత్య చేశారని సాయితేజ ఆరోపిస్తున్నాడు.

చిత్తూరు జిల్లాలో నెల రోజుల క్రితమే చంద్రగిరి దగ్గర పరువు హత్య చోటు చేసుకుంది. అది మరువక ముందే అదే తరహాలో చిత్తూరు జిల్లాలో మరో ఘటన వెలుగుచూసింది. ఇటీవలే ప్రేమ పెళ్లి చేసుకున్నారు సాయితేజ, యాస్మిన్. అయితే, అమ్మాయి కుటుంబసభ్యుల నుంచి అబ్బాయికి ప్రాణహాని ఉండటంతో.. తిరుపతి పోలీసులను ఆశ్రయించారు. ఇద్దరూ మేజర్లు కావడంతో పోలీసులు వారికి భరోసా ఇచ్చి పంపారు. యాస్మిన్ ను ఆమె తల్లిదండ్రులు దూరంగా పెట్టారు. మాట్లాడటం కూడా ఆపేశారు.

Also Read : 24 గంటల్లో డెలివరీ, ఇంతలోనే దారుణం.. నిండు గర్భిణిని చంపిన భర్త

అయితే, అనూహ్యంగా యాస్మిన్ సోదరుడు యాస్మిన్ కు ఫోన్ చేశాడు. నాన్నకు బాగోలేదు, నిన్ను కలవరిస్తున్నాడు, వెంటనే రావాలని యాస్మిన్ తో చెప్పాడు. యాస్మిన్ వెళ్లేందుకు సాయితేజ కూడా అనుమతి ఇచ్చాడు. యాస్మిన్ ను ఆమె సోదరుడితో పంపించాడు. అయితే, ఏం జరిగిందో కానీ, ఉదయానికి సాయితేజకు యాస్మిన్ కుటుంబసభ్యుల నుంచి ఫోన్ కాల్ వచ్చింది.

యాస్మిన్ ఇంట్లోనే ఉరేసుకుని చనిపోయిందని చెప్పారు. దాంతో సాయితేజ్ షాక్ కి గురయ్యాడు. యాస్మిన్ మరణంపై అతడు అనుమానం వ్యక్తం చేశాడు. ఇష్టం లేని పెళ్లి చేసుకుందని యాస్మిన్ ను ఆమె తల్లిదండ్రులే చంపి ఉంటారని సాయితేజ అనుమానం వ్యక్తం చేశాడు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు పలు కోణాల్లో దర్యాఫ్తు చేస్తున్నారు.

 

మరిన్ని ఇంట్రస్టింగ్ స్టోరీలు, అప్‌డేట్స్ కోసం 10టీవీ వాట్సాప్ చానల్‌ని ఫాలో అవ్వండి.. Click Here