Visakha Incident : 24 గంటల్లో డెలివరీ, ఇంతలోనే దారుణం.. నిండు గర్భిణిని చంపిన భర్త
కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. స్థానికంగా తీవ్ర విషాదం అలుముకుంది.

Visakha Incident : విశాఖలో దారుణం జరిగింది. భార్య పాలిట భర్తే యముడయ్యాడు. జీవితాంతం తోడుగా ఉంటానని వాగ్దానం చేసిన భర్తే.. భార్యను కడతేర్చాడు. మరో 24 గంటల్లో భార్య డెలివరీ కావాల్సి ఉంది. ఇంతలోనే దారుణం జరిగిపోయింది. నిండు గర్భిణి అని కూడా చూడలేదు. ఏ మాత్రం దయ చూపలేదు. అత్యంత కిరాతకంగా భార్య గొంతునులిమి చంపేశాడు. విశాఖ పీఎం పాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘోరం జరిగింది.
జ్ఞానేశ్వర్, అనూష ప్రేమించుకున్నారు. రెండేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు. వీరి ప్రేమ పెళ్లిని పెద్దలు ఒప్పుకోలేదు. దీంతో వారిద్దరూ వుడా కాలనీలో నివాసం ఉంటున్నారు. అయితే, కొన్ని రోజులుగా ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. రోజూ గొడవ పడుతున్నారు. సోమవారం కూడా వివాదం తలెత్తింది. ఈ క్రమంలో భర్త రెచ్చిపోయాడు.
నిండు చూలాలైన భార్యను అత్యంత దారుణంగా హత్య చేశాడు. ఆమె గొంతు నులిమి చంపేశాడు. ఆ తర్వాత తన బంధువులకు ఫోన్ చేశాడు. తన భార్యకు ఆరోగ్యం బాగోలేదని వెంటనే రావాలని కథలు చెప్పాడు. కుటుంబసభ్యులు వెంటనే వచ్చి అనూషను ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే అనూష చనిపోయిందని డాక్టర్లు చెప్పారు.
Also Read : సోషల్ మీడియాలో లీక్.. మహిళ ప్రాణం తీసిన ప్రైవేట్ వీడియో వివాదం.. నరసరావుపేటలో దారుణం..
దీంతో అనూష తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర విషాదం అలుముకుంది. మరో 24 గంటల్లో అనూష డెలివరీ కావాల్సి ఉంది. ఇంతలోనే ఘోరం జరిగిపోయింది. 24 గంటల్లో ఓ బిడ్డకు జన్మనివ్వాల్సిన తల్లి.. తానే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో కన్నీటిపర్యంతం అవుతున్నారు.
నిండు చూలాలు అని తెలిసినా అనూషని చంపడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఆమెను చంపడానికి అతడికి చేతులు ఎలా వచ్చాయని మండిపడుతున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకుంది ఇందుకేనా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భర్త జ్ఞానేశ్వర్ ను కఠినంగా శిక్షించాలని పోలీసులను మృతురాలి బంధువులు డిమాండ్ చేస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు జరుపుతున్నారు. జ్ఞానేశ్వర్ తన నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు.
మరిన్ని ఇంట్రస్టింగ్ స్టోరీలు, అప్ డేట్స్ కోసం 10టీవీ వాట్సాప్ చానల్ ని ఫాలో అవ్వండి.. Click Here