వివాహేతర సంబంధం : వ్యక్తిని హత్య చేసిన మహిళ

చిత్తూరు జిల్లా పీలేరులో అర్ధరాత్రి దారుణ హత్య జరిగింది. వివాహేతర సంబంధం నేపథ్యంలో రవి అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. కొత్తపల్లికి చెందిన గణపతి, ధనలక్ష్మి దంపతులు. ఇరువురి మధ్య గొడవలు జరగడంతో విడాకులు తీసుకున్నారు. ఈ క్రమంలో ధనలక్ష్మి రవి అనే మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది.
ఈ నేపథ్యంలోనే రవి అర్ధరాత్రి ధనలక్ష్మితో గొడవపడుతుండగా గమనించిన గణపతి ఇనుపరాడుతో రవి తలపై కొట్టడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని పీలేరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.