Woman molested : కీచక మామ.. కోడలిపై అత్యాచార యత్నం

కన్నకూతురులా చూసుకోవాల్సిన కోడలిపై కన్నశాడో కీచక మామ. కొడుకు ఆఫీసుకువెళ్ళగానే కోడలిపై అత్యాచారం చేయబోయాడు.కోడలు గట్టిగా కేకలు వేయటంతో పారిపోయాడు.

Woman molested : కీచక మామ.. కోడలిపై అత్యాచార యత్నం

Woman Molestead

Updated On : April 18, 2021 / 5:50 PM IST

Woman molested, threatened by father-in-law : కన్నకూతురులా చూసుకోవాల్సిన కోడలిపై కన్నశాడో కీచక మామ. కొడుకు ఆఫీసుకు  వెళ్ళగానే కోడలిపై అత్యాచారం చేయబోయాడు.   కోడలు గట్టిగా కేకలు వేయటంతో పారిపోయాడు. గుజరాత్, అహమ్మదాబాద్ లోని బాపూ నగర్ లో ఒక వివాహిత(34) భర్త పిల్లాడు, అత్తమామలతో కలిసి జీవిస్తోంది.   భర్త ఏఎంసీ లో  పని చేస్తున్నాడు. వారికి 15 ఏళ్ల కుమారుడు ఉన్నాడు.

మామ కోడలిపై ఎప్పటి నుంచి కన్నేశాడో ఏమో… కోడలిపై కోరిక పెంచుకున్నాడు.   ఏప్రిల్ 12 సోమవారం నాడు మహిళ భర్త ఆఫీసుకు వెళ్లి పోయాడు. అత్త మొదటి అంతస్తులో నిద్రపోతుండగా కోడలిపై  కన్నేసిన మామ కొడుకు ఇంట్లోకి వచ్చాడు.

వంటింట్లో పని చేసుకుంటున్న కోడలి వద్దకు  వెళ్లి అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమెను తన చేష్టలతో ఇబ్బందులకు గురిచేశాడు. తన కోరిక తీర్చాలంటూ ఆమెపై అత్యాచారం చేయబోయాడు.  కోడలు ప్రతిఘటించి గట్టిగా అరిచింది.

ఈవిషయం ఎవరికైనా చెపితే చంపేస్తానని బెదిరించాడు. అయినా ఆమె లొంగకపోయే సరికి దుశ్సాసన పర్వానికి తెర తీశాడు. భయపడి పోయిన కోడలు గట్టిగా కేకలు వేసింది. కేకలు విని ఆమె 15 ఏళ్లకుమారుడు అక్కడకు పరిగెత్తుకుంటూ వచ్చాడు.

మనవడిని  చూసిన మామ వెనక్కి తగ్గి,  ఈ విషయం ఎవరికైనా చెపితే   ఆమెపై నిందలు వేస్తానని… చంపేస్తానని బెదిరించి వెళ్లిపోయాడు. జరిగిన ఘటనపై మధన పడిన బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు  దర్యాప్తు  ప్రారంభించారు.