ఈ ఘోరం ఏంటయ్యా : బాలుడిపై ఏడాదిగా మహిళ అత్యాచారం

కామోన్మాదంతో తీరుతెన్నూ లేకుండా సాగిపోతుందీ సమాజం. మహిళ అత్యాచారాలు, బాలలపై లైంగిక వేధింపులు పేట్రేగిపోతున్నాయి. ఇన్నాళ్లూ ఈ సంఘటనలలో పురుష పుంగవులే విలన్లుగా కనిపిస్తే.. ఓ 36ఏళ్ల మహిళ ట్రెండ్ మార్చి రచ్చ చేసింది. ఆ 9ఏళ్ల చిన్నారిని సంవత్సర కాలంగా దారుణానికి గురిచేసింది. క్యాన్సర్ పేషెంట్ అని కూడా జాలి చూపించకుండా బాలుడిపై పైశాచికత్వం చూపించింది.
కేరళ రాష్ట్రం తిరువనంతపురంలోని తెనిప్పలం పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. 9ఏళ్ల బాలుడిపై 12నెలల పాటు అత్యాచారం జరిపిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఫిబ్రవరి మొదటి వారంలో బాధితుడి ఆరోగ్యం బాగా దెబ్బతినడంతో వైద్యుడిని సంప్రదించారు తల్లిదండ్రులు. సంవత్సరం పాటు తాను అనుభవిస్తున్న నరకాన్ని వైద్యుని ముందు వెల్లగక్కాడు.
వెంటనే చైల్డ్ లైన్ వారికి సమాచారం అందించారు. బాలల హక్కల పరిరక్షణ వారు ఆ చిన్నారి మానసిక ఆరోగ్యం పూర్తిగా దెబ్బతిన్నట్లు నిర్ధారించారు. ఈ మేర బాలలపై లైంగిక వేధింపులు చట్టం(పోస్కో) కింద కేసు నమోదు చేశారు. ఎర్నాకులం ప్రాంతంలో ఉన్న మహిళను అరెస్టు చేసినట్లు ఎస్సై మినూ థామస్ మీడియా సమావేశంలో వెల్లడించారు.
Also Read : ఈ దేశాల్లో ప్రేమికుల దినోత్సవం నిషేధం!