Monu Manesar: ఎవరు ఈ మోను మానేసర్..? గురుగ్రామ్‭ హింసకు సూత్రధారి అయిన ఇతడి గత చరిత్ర తెలుసా?

జునైద్, నసీర్ పశువుల వ్యాపారులు. ఆ ఇద్దరిని బజరంగ్ దళ్ సభ్యులు కొట్టి చంపారని రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌లోని వారి కుటుంబాల సభ్యులు ఆరోపించారు. రాజస్థాన్ పోలీసులు మానేసర్‌ను చాలాసార్లు అరెస్టు చేయడానికి ప్రయత్నించినప్పటికీ, అరెస్ట్ సమాచారం లీక్ కావడంతో తప్పించుకొని తిరుగుతున్నాడు

Monu Manesar: ఎవరు ఈ మోను మానేసర్..? గురుగ్రామ్‭ హింసకు సూత్రధారి అయిన ఇతడి గత చరిత్ర తెలుసా?

హర్యానాలోని నుహ్‌లో సోమవారం విశ్వహిందూ పరిషత్ బ్రజమండల్ యాత్రపై రాళ్లు రువ్వడంతో హింస చెలరేగింది. ఈ హింసాకాండలో ఇప్పటి వరకు ఇద్దరు హోంగార్డులు సహా ఐదుగురు చనిపోయారు. కాగా, 60 మందికి పైగా గాయపడ్డారు. ఈ హింసాత్మక మంటలు దేశ రాజధాని సమీపంలోని గురుగ్రామ్‌కు వ్యాపించాయి. సోమవారం రాత్రి అక్కడ మసీదును తగులబెట్టారు. అయితే ఈ హింసకు కారకుడు మోను మానేసర్ అనే వ్యక్తని సర్వత్రా వినిపిస్తోంది. మోను మానేసర్ బ్రజమండల్ యాత్రకు ముందు ఒక వీడియోను పోస్ట్ చేశాడు.

Mayawati: బద్రినాథ్, జ్ఞానవాపి వివాదాలను ప్రస్తావిస్తూ బీజేపీ, ఎస్పీలపై మండిపడ్డ మాయావతి

తాను నుహ్ లో జరిగే మతపరమైన ఊరేగింపులో పాల్గొంటానని ఆ వీడియోలో పేర్కొన్నాడు. అలాగే యాత్రకు పెద్ద సంఖ్యలో రావాలని తన మద్దతుదారులకు పిలుపునిచ్చాడు. వాస్తవానికి అతడు ఆ యాత్రకు హాజరు కాలేదు. విశ్వహిందూ పరిషత్‌ సలహా మేరకే మోను మానేసర్‌ యాత్రలో పాల్గొనలేదని, తన ఉనికి ఉద్రిక్తతకు దారితీస్తుందనే భయంతోనే ఆయన యాత్రలో పాల్గొనలేదని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.

మోను మానేసర్ నిజస్వరూపం..
మోను మానేసర్ (30) బజరంగ్ దళ్ నాయకుడు. తనను తాను గోసంరక్షకుడు అని కూడా చెప్పుకుంటాడు. ఫిబ్రవరిలో భివానీలో ఇద్దరు ముస్లింలను బొలెరో దగ్ధం చేసిన ఘటనలో అతడి పేరు వెలుగులోకి వచ్చింది. మృతులు రాజస్థాన్‌కు చెందిన జునైద్, నసీర్‌లుగా గుర్తించారు. వారిని అపహరించిన తర్వాత మోను మానేసర్ వారిద్దరినీ హత్య చేసి, ఆపై దహనం చేశాడని ఆరోపించారు.

జునైద్, నసీర్ పశువుల వ్యాపారులు. ఆ ఇద్దరిని బజరంగ్ దళ్ సభ్యులు కొట్టి చంపారని రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌లోని వారి కుటుంబాల సభ్యులు ఆరోపించారు. రాజస్థాన్ పోలీసులు మానేసర్‌ను చాలాసార్లు అరెస్టు చేయడానికి ప్రయత్నించినప్పటికీ, అరెస్ట్ సమాచారం లీక్ కావడంతో తప్పించుకొని తిరుగుతున్నాడు. మోను మానేసర్ అలియాస్ మోహిత్ యాదవ్ అనే అతడు మేవాట్‌లో గోసంరక్షణ బృందానికి నాయకత్వం వహిస్తున్నాడు. లవ్ జిహాద్‌కు వ్యతిరేకంగా ప్రచారంలో కూడా చురుకుగా ఉంటాడు.

Madhya Pradesh: బీజేపీ పాలిత రాష్ట్రంలో షాకింగ్ ఘటన.. హిందూ మతం స్వీకరించిన 190 మంది ముస్లింలు

2019లో ఆవు స్మగ్లర్లను వెంబడిస్తూ కాల్పులు జరపడంతో అతడు మొదటిసారి వార్తల్లో నిలిచాడు. 2015లో గోసంరక్షణ చట్టం అమలులోకి వచ్చిన తర్వాత హర్యానా ప్రభుత్వం ఏర్పాటు చేసిన జిల్లా గోసంరక్షణ టాస్క్‌ఫోర్స్‌లో సభ్యుడు కూడా ఉన్నాడు. మోను మానేసర్‌కి సోషల్ మీడియాలో చాలా మంది ఫాలోవర్లు ఉన్నారు. అతను తరచుగా ఆయుధాలు, కార్లను చూపిస్తూ సోషల్ మీడియాల్లో ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తుంటాడు. అయితే ఇప్పటి వరకు అతడిపై చర్యలు లేకపోవడం గమనార్హం.