డోంట్ మిస్ : FCIలో 4వేల ఉద్యోగాలు

  • Published By: chvmurthy ,Published On : February 27, 2019 / 03:25 AM IST
డోంట్ మిస్ : FCIలో 4వేల ఉద్యోగాలు

Updated On : February 27, 2019 / 3:25 AM IST

భారతీయ ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ)  దేశవ్యాప్తంగా  పలు కేటగిరీల్లో 4వేల 103  ఉద్యోగాల భర్తీకి  నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిలో జూనియర్‌ ఇంజినీర్లు, గ్రేడ్‌-2 హిందీ, గ్రేడ్‌-3 జనరల్, అకౌంట్స్, టెక్నికల్, అసిస్టెంట్లు, స్టెనోగ్రాఫర్, టైపిస్టు (హిందీ) పోస్టులు ఉన్నాయి. అన్ని విభాగాల్లోనూ కలిపి సౌత్‌ జోన్‌లో 540 పోస్టులున్నాయి. అభ్యర్థులు తమకు నచ్చిన జోన్‌ను ఎంచుకోవచ్చు. ఆ జోన్‌లో ఏదో ఒక పోస్టుకు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. రెండు దశల్లో నిర్వహించే ఆన్‌లైన్‌ పరీక్షల్లో చూపిన ప్రతిభ ద్వారా నియామకాలు ఉంటాయి. రెండు దశల్లో నిర్వహించే పరీక్షల ద్వారా FCI పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 
ఇందులో అభ్యర్థులందరికీ ఉమ్మడిగా ఫేజ్‌-1 ఉంటుంది. దరఖాస్తు చేసుకున్న పోస్టు ప్రకారం ఫేజ్‌-2 నిర్వహిస్తారు. ఫేజ్‌-1 లో అర్హత సాధించినవారిని ఆయా విభాగాల్లో ఉన్న ఖాళీలకు 15 రెట్ల సంఖ్యలో ఫేజ్‌-2 పరీక్షలకు అనుమతిస్తారు. వీటి మార్కుల ప్రకారం తుది నియామకాలుంటాయి.

మొత్తం ఖాళీల సంఖ్య : 4,103
సౌత్ జోన్-540
నార్త్ జోన్-1,999
ఈస్ట్ జోన్-538
వెస్ట్ జోన్-735
నార్త్ ఈస్ట్-291
అభ్యర్ధులు ఏదైనా ఒక జోన్ కు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి

సౌత్ జోన్ లో ఉన్న 540 ఖాళీల్లో 
జూనియర్ ఇంజనీర్ సివిల్ -26
జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ మెకానికల్-15
స్టెనో గ్రేడ్ 2-7
అసిస్టెంట్ గ్రేడ్ 2 హిందీ- 15
టైపిస్ట్ హిందీ – 3
అసిస్టెంట్ గ్రేడ్ 3 జనరల్-159
అసిస్టెంట్ గ్రేడ్ 3 (ఏజీ) అకౌంట్స్ -48
ఏజీ 3 టెక్నికల్ 54
ఏజీ 3 డిపో  213  పోస్టులు ఉన్నాయి. 

అర్హతలు  :
*జూనియర్ ఇంజనీర్  (సివిల్‌): సివిల్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ లేదా డిప్లొమాతోపాటు ఏడాది ప‌ని అనుభ‌వం ఉండాలి. 
*జూనియర్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లేదా మెకానికల్ ఇంజనీరింగ్) డిగ్రీ, డిప్లొమా ఇన్ ఎలక్రికల్/మెకానికల్  ఇంజనీరింగ్ డిప్లోమా అభ్యర్ధులకు సదరు రంగంలో ఏడాది అనుభవం ఉండాలి  వయో పరిమితి 28 ఏళ్లు. 
*స్టెనో గ్రేడ్ 2: డిగ్రీతోపాటు డీఓఈఏసీసీ నుంచి ఓ లెవెల్ అర్హ‌త‌, టైపింగ్‌లో 40, షార్ట్‌హ్యాండ్‌లో 80 ప‌దాలు నిమిషానికి టైప్ చేయగలిగి ఉండాలి.  లేదా కంప్యూట‌ర్ సైన్స్‌/ క‌ంప్యూట‌ర్ అప్లికేష‌న్స్‌లో డిగ్రీతోపాటు టైపింగ్‌లో 40, షార్ట్‌హ్యాండ్‌లో 80 ప‌దాలు నిమిషానికి ఉండాలి.  వయో పరిమతి 25 ఏళ్లు.
*అసిస్టెంట్ గ్రేడ్ 2(హిందీ)  హిందీ ప్ర‌ధాన స‌బ్జెక్టుగా డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. ఇంగ్లీషు భాషలో  నైపుణ్యం ఉండాలి, ఇంగ్లిష్ నుంచి హిందీ అలాగే హిందీ నుంచి ఇంగ్లిష్ అనువాదంలో ఏడాది అనుభ‌వం ఉండాలి.  వయో  పరిమితి 28 ఏళ్లు
*టైపిస్టు హిందీ : ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణ‌త‌తోపాటు నిమిషానికి 30 హిందీ ప‌దాలు టైప్ చేయ‌గ‌ల‌గాలి. హిందీ, ఇంగ్లిష్ రెండు భాష‌ల్లోనూ టైప్ చేయ‌గ‌ల‌గ‌డం, కంప్యూట‌ర్ ప‌రిజ్ఞానం ఉన్న‌వారికి ప్రాధాన్యం ఉంటుంది.  వయో పరిమితి 25 ఏళ్లు 
*అసిస్టెంట్ గ్రేడ్‌-3 జ‌న‌ర‌ల్: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణ‌త‌. కంప్యూట‌ర్ ప‌రిజ్ఞానం ఉండాలి.
*అసిస్టెంట్ గ్రేడ్ 3 అకౌంట్స్  :బీకాం ఉత్తీర్ణ‌త‌. కంప్యూట‌ర్ ప‌రిజ్ఞానం ఉండాలి.
వయో పరిమితి 27 ఏళ్లు 
* అసిస్టెంట్ గ్రేడ్ 3 టెక్నికల్ : గ్రేడ్‌-3 టెక్నిక‌ల్‌: బీఎస్సీ అగ్రికల్చర్, బోట‌నీ/ జువాల‌జీ/ బ‌యోకెమిస్ట్రీ/ బ‌యోటెక్నాల‌జీ/ మైక్రో బ‌యాల‌జీ/ ఫుడ్ సైన్స్ వీటిలో ఏదైనా స‌బ్జెక్టుతో బీఎస్సీ లేదా ఫుడ్ సైన్స్‌/ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాల‌జీ/ అగ్రిక‌ల్చ‌ర‌ల్ ఇంజినీరింగ్‌/ బ‌యోటెక్నాల‌జీ వీటిలో ఎందులోనైనా బీఈ/ బీటెక్ చ‌దివుండాలి. కంప్యూట‌ర్ ప‌రిజ్ఞానం అవ‌స‌రం.  వయో పరిమితి  27 ఏళ్లు. 
*అసిస్టెంట్ గ్రేడ్‌-3 డిపో‌: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణ‌త‌. కంప్యూట‌ర్ ప‌రిజ్ఞానం ఉండాలి. వయో  పరిమితి 27 ఏళ్లు .

*వ‌య‌సు: జ‌న‌వ‌రి 1, 2019 నాటికి జూనియ‌ర్ ఇంజినీర్‌, గ్రేడ్‌-2 హిందీ పోస్టుల‌కు 28 ఏళ్ల‌లోపు ఉండాలి. గ్రేడ్‌-2 స్టెనో, టైపిస్ట్ హిందీ పోస్టుల‌కు 25 ఏళ్ల‌లోపువారు అర్హులు. గ్రేడ్‌-3 జ‌న‌ర‌ల్‌/ అకౌంట్స్‌/ టెక్నిక‌ల్‌/ డిపోట్ పోస్టుల‌కు 27 ఏళ్ల‌లోపు ఉండాలి. ఎస్సీ, ఎస్టీల‌కు అయిదేళ్లు; ఓబీసీల‌కు మూడేళ్లు, దివ్యాంగుల‌కు ప‌దేళ్లు గ‌రిష్ఠ వ‌యోప‌రిమితిలో స‌డ‌లింపులు వ‌ర్తిస్తాయి.
*ఫేజ్‌-1 ప‌రీక్ష కేంద్రాలు: ఏపీలో చీరాల‌, గుంటూరు, కాకినాడ‌, క‌ర్నూలు, నెల్లూరు, రాజ‌మండ్రి, తిరుప‌తి, విజ‌య‌వాడ‌, విశాఖ‌ప‌ట్నం, విజ‌య‌న‌గ‌రం, శ్రీకాకుళం.తెలంగాణ‌లో..హైద‌రాబాద్‌, క‌రీంన‌గ‌ర్‌, ఖ‌మ్మం, వ‌రంగ‌ల్‌, న‌ల్గొండ‌, నిజామాబాద్‌. ఫేజ్‌-2 ప‌రీక్ష‌ను ఏపీలో విజ‌య‌వాడ‌, విశాఖ‌ప‌ట్నం తెలంగాణ‌లో హైద‌రాబాద్‌లో మాత్ర‌మే నిర్వ‌హిస్తారు. 
ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం: ఫిబ్రవరి 28 
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 30 దరఖాస్తు ఫీజు: రూ.500. పరీక్షలు: ఏప్రిల్‌ లేదా మేలో నిర్వహించవచ్చు. 
మరింత పూర్తి సమాచారం కొరకు వెబ్‌సైట్‌: www.fci.gov.in