Cisf Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ లో 540 ఖాళీల భర్తీ
పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా గుర్తింపు పొందిన బోర్డు నుండి 10+2 పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. దరఖాస్తు చివరి తేదీ నాటికి సర్టిఫికేట్ పొందాలి. అభ్యర్థుల వయస్సు 18 సంవత్సరాల నుండి 25 సంవత్సరాలలోపు ఉండాలి.

cisf jobs
Cisf Recruitment : కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సిఐఎస్ ఎఫ్)లో పలు ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 540 ఖాళీలను భర్తీ చేయనున్నారు. భర్తీ చేయనున్న పోస్టులకు సంబంధించి ఏఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్ ఖాళీలు ఉన్నాయి. అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ ASI – స్టెనోగ్రాఫర్, మరియు హెడ్ కానిస్టేబుల్ (మినిస్టీరియల్) 122 ఖాళీలు, 418 హెడ్ కానిస్టేబుల్ (మినిస్టీరియల్) పోస్టులు ఉన్నాయి. ఆసక్తి, అర్హత గల అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు.
పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా గుర్తింపు పొందిన బోర్డు నుండి 10+2 పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. దరఖాస్తు చివరి తేదీ నాటికి సర్టిఫికేట్ పొందాలి. అభ్యర్థుల వయస్సు 18 సంవత్సరాల నుండి 25 సంవత్సరాలలోపు ఉండాలి. రిజర్వ్‌డ్ కేటగిరీలకు SC, ST, OBC, మొదలైన అభ్యర్థులకు కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఇవ్వబడుతుంది. పురుష అభ్యర్థుల ఎత్తు 165 సెంటీమీటర్ల కంటే తక్కువ ఉండకూడదు మరియు మహిళా అభ్యర్థులు 155 సెంటీమీటర్ల కంటే తక్కువ ఉండకూడదు.
అభ్యర్ధులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ 26, 2022 నుండి ప్రారంభమౌతుంది. దరఖాస్తు పక్రియకు చివరి తేదిగా అక్టోబరు 25, 20222ను నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; cisfrectt.in పరిశీలించగలరు.