Senior Resident Posts Recruitment
Senior Resident Posts : రాష్ట్రంలో ఈ విద్యాసంవత్సరం నుండి నూతనంగా ప్రారంభించిన ఐదు వైద్య కళాశాలలతోపాటు వచ్చే ఏదాది ప్రారంభించనున్న మరో ఐదు కళాశాలల్లో టీచింగ్ పోస్టుల భర్తీ చేపట్టనున్నారు.
READ ALSO : NTR Coins : రికార్డు స్థాయిలో ఎన్టీఆర్ స్మారక నాణేల విక్రయం
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 480 మంది సీనియర్ రెసిడెంట్స్(ఎస్‌ఆర్) పోస్టుల నియామకాలను చేపట్టనున్నారు. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(డీఎంఈ) నియామక ప్రక్రియను నిర్వహించనుంది.
READ ALSO : Amanchi Krishna Mohan : చంద్రబాబును పురందేశ్వరి వెనకేసుకు రావడం విడ్డూరం : ఆమంచి
మొత్తం 21 విభాగాల్లో 480 మంది సీనియర్ రెసిడెంట్స్‌ను నియమించనుండగా వాటిలో ఎమర్జెన్సీ మెడిసిన్‌లో 75, అనాటమీలో 49, బయోకెమిస్ట్రీలో 39, జనరల్ మెడిసిన్‌లో 34 ఖాళీలతోపాటు ఇతర విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.
READ ALSO : Barrelakka Sirisha : కొల్లాపూర్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న బర్రెలక్క
వైద్య విద్య పీజీలో వచ్చిన మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ (ఆర్‌వోఆర్) ఆధారంగా నియామకాలు చేపట్టనున్నారు. ఎంపికైన వారికి నెలకు రూ.70వేల చొప్పున గౌరవ వేతనం చెల్లిస్తారు.
READ ALSO : Maize Cultivation : రబీ జొన్నలో అధిక దిగుబడులకోసం పాటించాల్సిన మేలైన యాజమాన్యం
ఇంటర్వ్యూ ప్రక్రియ ద్వారా అభ్యర్ధుల ఎంపిక చేపట్టనున్నారు. ఈ నెల 23వ తేదీన విజయవాడలోని డీఎంఈ కార్యాలయంలో నేరుగా వాక్-ఇన్ ఇంటర్వ్యూలకు అభ్యర్ధులు హాజరుకావాల్సి ఉంటుంది.