AIIMS INI CET January 2025 Result Announced
AIIMS INI CET January 2025 Result : ఎఐఐఎమ్ఎస్ ఐఎన్ఐ సెట్ జనవరి 2025 రిజల్ట్స్ అధికారిక వెబ్‌సైట్ (aiimsexams.ac.in)లో విడుదల అయ్యాయి. ఎఐఐఎమ్ఎస్ ఐఎన్ఐ సెట్ 2025 ఫలితాలను యాక్సెస్ చేయొచ్చు. విద్యార్థులు తమ రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీ వంటి వారి లాగిన్ వివరాలను ఉపయోగించాల్సి ఉంటుంది. ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ ఫర్ మెడికల్ ఎడ్యుకేషన్‌లో MD, MS, DM, MCH, MDS వంటి పోస్ట్‌గ్రాడ్యుయేట్ కోర్సులలో ప్రవేశం కోసం ఈ ప్రవేశ పరీక్షను నిర్వహిస్తారు.
విద్యార్థులు రిజల్ట్స్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం ప్రింటౌట్ తీసుకోవచ్చు.
ఎఐఐఎమ్ఎస్ ఐఎన్ఐ సెట్ 2025 పరీక్ష నవంబర్ 10, 2024న కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) ఫార్మాట్‌లో షెడ్యూల్ అయింది. జనవరి 2025 సెషన్ కోసం ఈ పరీక్షలో 200 ఆబ్జెక్టివ్-టైప్ ప్రశ్నలు ఉన్నాయి. ఇందులో ఒకే సరైన ఆప్షన్, మల్టీపుల్ ఆప్షనల్ ప్రశ్నలు ఉన్నాయి. అభ్యర్థులకు ప్రతి సరైన సమాధానానికి ఒక మార్కు ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి మూడింట ఒక వంతు మార్కు తొలగిస్తారు. ఐఎన్ఐ-సెట్ జనవరి 2025 పరీక్ష మొత్తం వ్యవధి మూడు గంటలు ఉంటుంది.
ఎండీ, ఎంఎస్, ఎం.సీహెచ్‌తో సహా వివిధ పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులలో ప్రవేశాల కోసం ఐఎన్ఐ-సెట్ జనవరి 2025 నిర్వహించింది. ఈ పరీక్ష జనవరి 2025 అకడమిక్ సెషన్ కోసం ఎఐఐఎమ్ఎస్, న్యూఢిల్లీ అందించే ప్రోగ్రామ్‌లతో పాటు జేఐపీఎమ్ఈఆర్ పుదుచ్చేరి, ఎన్ఐఎమ్‌హెచ్ఎఎన్ఎస్ బెంగళూరు, పీజీఐఎమ్ఈఆర్ చండీగఢ్, ఎస్‌సీటీఐఎమ్ఎస్‌టీ త్రివేండ్రం వంటి ఇతర సంస్థలలో ప్రవేశాన్ని పొందవచ్చు.