AAICLAS Recruitment : ఎయిర్‌పోర్ట్స్ అధారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగ ఖాళీల భర్తీ

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు కనీసం 60 శాతం మార్కులతో ఇంటర్ లేదా తత్సామాన విద్యార్హత ఉండాలి. ఇంగ్లిష్, హిందీ లేదా స్థానిక భాషలో మాట్లాడే సామర్థ్యం కలిగి ఉండాలి. వయోపరిమితి 27 సంవత్సరాలకు మించకూడదు.

aaiclas

AAICLAS Recruitment : ఎయిర్‌పోర్ట్స్ అధారిటీ ఆఫ్ ఇండియా కార్గో లాజిస్టిక్స్ అండ్‌ అలైడ్ సర్వీసెస్ కంపెనీ లిమిటెడ్ న్యూఢిల్లీ పలు పోస్టుల భర్తీ చేపట్టనుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా దేశవ్యాప్తంగా ఏఏఐసీఎల్‌ఏఎస్‌ కేంద్రాల్లో అసిస్టెంట్(సెక్యూరిటీ) పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం 436 అసిస్టెంట్ (సెక్యూరిటీ) పోస్టులను మూడేళ్ల కాలవ్యవధికి ఫిక్స్‌డ్ టర్మ్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఈ పోస్టులను భర్తీచేస్తారు.

READ ALSO : Minister Botcha Satyanarayana: మీ పిల్లలకేనా ఇంగ్లీష్ మీడియం చదువులు.. పేదలకు వద్దా? పవన్ అవగాహనతో మాట్లాడాలి

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు కనీసం 60 శాతం మార్కులతో ఇంటర్ లేదా తత్సామాన విద్యార్హత ఉండాలి. ఇంగ్లిష్, హిందీ లేదా స్థానిక భాషలో మాట్లాడే సామర్థ్యం కలిగి ఉండాలి. వయోపరిమితి 27 సంవత్సరాలకు మించకూడదు. ఎంపికైన వారు చెన్నై, కోల్‌కతా, గోవా, కోజికోడ్, వారణాసి, శ్రీనగర్, వడోదర, తిరుపతి, వైజాగ్, మధురై, తిరుచ్చి, రాయ్‌పూర్, రాంచీ, భువనేశ్వర్, పోర్ట్ బ్లెయిర్, అగర్తల, గ్వాలియర్, అమృత్‌సర్, లేహ్, డెహ్రాడూన్, పుణె, ఇండోర్, సూరత్ లలో పనిచేయాల్సి ఉంటుంది.

READ ALSO : Dry Fruits : డ్రై ఫ్రూట్స్ ను ఆహారంగా తీసుకుంటే ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు పొందొచ్చంటే ?

ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. ఎంపికైన వారికి జీత భత్యాలు నెలకు రూ.21,500 నుంచి రూ.22,500. చెల్లిస్తారు. ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫీజు జనరల్/ ఓబీసీ అభ్యర్థులకు రూ.500. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్‌, మహిళా అభ్యర్థులకు రూ.100. చెల్లించాలి. ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది 15.11.2023.గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://aaiclas.aero పరిశీలించగలరు.