AIIMS Bhopal Recruitment : ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ భోపాల్ లో పోస్టుల భర్తీ
పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో పీజీ డిగ్రీ, ఎండీ, ఎంఎస్, డీఎం ఉత్తీర్ణత పొందినవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్ధుల వయస్సు 50 సంవత్సరాల లోపు ఉండాలి.

AIIMS Bhopal Recruitment
AIIMS Bhopal Recruitment : ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్) భోపాల్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 15 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు.
READ ALSO : ICAR Recruitment : ఐసీఏఆర్ పరిశోధన సంస్థల్లో సైంటిస్ట్ పోస్టుల భర్తీ
పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో పీజీ డిగ్రీ, ఎండీ, ఎంఎస్, డీఎం ఉత్తీర్ణత పొందినవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్ధుల వయస్సు 50 సంవత్సరాల లోపు ఉండాలి. గ్యాస్ట్రోఎంటరాలజీ, మెడికల్ ఆంకాలజీ,హెమటాలజీ, నియోనాటాలజీ, నెఫ్రాలజీ, న్యూరాలజీ, న్యూరో సర్జరీ, న్యూక్లియర్ మెడిసిన్, ఆర్థోపెడిక్స్, రేడియో డయాగ్నసిస్, సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ, సర్జికల్ ఆంకాలజీ, యూరాలజీ, కార్డియాలజీ, కార్డియోథొరాసిక్ & వాస్కులర్ సర్జరీ(సీటీవీఎస్), డెర్మటాలజీ తదితర విభాగాల్లో ఈ ఖాళీల్లో ఉన్నాయి.
READ ALSO : Fish Food : చేపలకు ఆహారంగా గుమ్మడికాయలు
దరఖాస్తులను ఈమెయిల్ ద్వారా పంపాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధుల ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.142506 చెల్లిస్తారు. అర్హతలు గల అభ్యర్థులు ఆగస్టు 14 , 2023 వరకు ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్వ్యూ తేది 16.08.2023.గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://aiimsbhopal.edu.in/