Allahabad University : బీబీఏ, ఎంబీఏ విద్యార్థులకు శ్రీకృష్ణుని మేనేజ్‌మెంట్ మంత్రాల బోధన…అలహాబాద్ విశ్వవిద్యాలయం కొత్త కోర్సు ప్రారంభం
అలహాబాద్ విశ్వవిద్యాలయంలో బీబీఏ, ఎంబీఏ విద్యార్థులకు ఇక నుంచి శ్రీకృష్ణుని మేనేజ్‌మెంట్ మంత్రాల బోధించాలని నిర్ణయించారు.....

Allahabad University
Allahabad University : అలహాబాద్ విశ్వవిద్యాలయంలో బీబీఏ, ఎంబీఏ విద్యార్థులకు ఇక నుంచి శ్రీకృష్ణుని మేనేజ్‌మెంట్ మంత్రాల బోధించాలని నిర్ణయించారు. ఉపనిషత్తులు, చాణక్యడి, భగవద్దీత, రామాయణంలో శ్రీకృష్ణుని నిర్వహణ మంత్రాలను విద్యార్థులకు బోధించేందుకు ఈ విద్యా సంవత్సరం నుంచి ఐదు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ మేనేజ్ మెంట్ కోర్సును ప్రారంభించారు.
Also Read : Swarna Mudra sweet : దీపావళికి స్వర్ణ ముద్ర స్వీట్లు…కిలో ధర తెలిస్తే షాకవుతారు
అలహాబాద్ విశ్వవిద్యాలయం కామర్స్ ఫ్యాకల్టీ ఈ అకడమిక్ సెషన్ నుంచి ప్రారంభించనున్న కొత్త కోర్సులో చేరే విద్యార్థులకు భగవద్గీత, రామాయణం ద్వారా శ్రీకృష్ణుని నిర్వహణ మంత్రాలను బోధించనున్నారు. ఉపనిషత్తులు, చాణక్యుడి పాఠాలు, జేఆర్‌డీ టాటా, అజీమ్ ప్రేమ్‌జీ, ధీరూభాయ్ అంబానీ, నారాయణ్ మూర్తి, సునీల్ మిట్టల్, బిర్లా వంటి అగ్రశ్రేణి పారిశ్రామికవేత్తల స్మార్ట్ మేనేజ్‌మెంట్ నిర్ణయాలను కూడా విద్యార్థులు అధ్యయనం చేయనున్నారు.
Also Read : UK Bans Laughing Gas : ఇక లాఫింగ్ గ్యాస్‌పై నిషేధం…యూకే సంచలన నిర్ణయం
26 మంది విద్యార్థులతో ఈ కొత్త కోర్సును ప్రారంభించనున్నారు. మొదటి సంవత్సరంలో చదువును వదిలివేస్తే వారు ఒక సంవత్సరం సర్టిఫికేట్ పొందుతారు. విద్యార్థులు రెండవ సంవత్సరంలో డిప్లొమా పొందుతారు. మూడవ సంవత్సరంలో బీబీఏ డిగ్రీ, ఐదవ సంవత్సరంలో ఎంబీఏ డిగ్రీ పొందుతారని వర్శిటీ అధికారులు చెప్పారు.
Also Read : Most Expensive Hotel : ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన హోటల్‌లో రాత్రి బస చేయాలంటే…
మేనేజ్‌మెంట్ ఆలోచన,అభ్యాసాల పేపర్‌లో విద్యార్థులకు ఆధ్యాత్మికత, నిర్వహణ, సాంస్కృతిక తత్వాలు, మానవ విలువలు, నిర్వహణతో పాటు సబ్జెక్ట్ సంప్రదాయిక అధ్యయనాన్ని అందించనున్నట్లు అధ్యాపకులు తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్,స్టార్టప్ మేనేజ్‌మెంట్ కూడా పాఠ్యాంశాల్లో చేర్చనున్నారు.