Mega DSC Final Key: ఏపీ మెగా డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. పరీక్షల ఫైనల్ ‘కీ’ విడుదల.. ఇలా చెక్ చేసుకోండి
Mega DSC Final Key: ఏపీ గవర్నమెంట్ గుడ్ న్యూస్ చెప్పింది. ఏపీ మెగా డీఎస్సీ పరీక్షలకు సంబందించిన ఫైనల్ కీ లను విడుదల చేశారు చేసింది.

Andhra Pradesh Mega DSC 2025 Final Key Released
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల ఏపీ మెగా డీఎస్సీ పరీక్షల జరిగిన విషయం తెలిసిందే. అప్పటి నుండి దీనికి సంబందించిన ఫలితాల కోసం అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. వారి కోసం తాజాగా ఏపీ గవర్నమెంట్ గుడ్ న్యూస్ చెప్పింది. ఏపీ మెగా డీఎస్సీ పరీక్షలకు సంబందించిన ఫైనల్ కీ లను విడుదల చేశారు చేసింది. అన్ని సబ్జెకులకు సంబందించిన ఫైనల్ కీలను అందుబాటులోకి తీసుకొచ్చింది విద్యాశాఖ. పరీక్షలు రాసిన అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ https://apdsc.apcfss.in/ ద్వారా వాటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు.
మెగా డీఎస్సీ 2025 పైనల్ కీ ఇలా చెక్ చేసుకోండి:
- అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్ సైట్ https://apdsc.apcfss.in/ లోకి వెళ్లాలి.
- హోం పేజీలో ఫైనల్ కీ ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
- అక్కడ సబ్జెక్టుల వారీగా పేర్లు కనిపిస్తాయి.
- సబ్జెక్ట్ పక్కన డాక్యుమెంట్ ఆప్షన్ ఉంటుంది.
- దాని పక్కన క్లిక్ చేస్తే ఫైనల్ కీ పీడీఎఫ్ ఓపెన్ అవుతుంది.
- కీలో వచ్చే మార్కులను బట్టి అభ్యర్థులు తమ తుది ఫలితాలపై ఓ అంచనాకు రావచ్చు.
ఇక ఏపీ మెగా డీఎస్సీ 2025 లో భాగంగా మొత్తం 16,347 పోస్టులను భర్తీ చేయనున్నారు అధికారులు. ఈసారి ఈ మెగా డీఎస్సీలో అన్ని ఖాళీలకు కలిపి మొత్తం 5,77,417 అప్లికేషన్లు వచ్చాయి.