All The Best : ఏపీ ఎంసెట్

  • Published By: madhu ,Published On : April 24, 2019 / 02:58 AM IST
All The Best : ఏపీ ఎంసెట్

Updated On : April 24, 2019 / 2:58 AM IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంసెట్ పరీక్షకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. నిమిషం నిబంధనను కంటిన్యూ చేస్తున్నారు. ఇంజినీరింగ్, అగ్రికల్చర్, బీ ఫార్మసీ, డీ ఫార్మసీ తదితర కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించి పరీక్షలు జరుగుతున్నాయి. ఉదయం 10గంటలకు ఎగ్జామ్స్ స్టార్ట్ కానున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో 115 సెంటర్లు ఏర్పాటు చేశారు. ఏపీలో 109, తెలంగాణలో 6 సెంటర్లున్నాయి. 

ఇంజినీరింగ్‌ విభాగంలో 1,95,723 మంది, అగ్రికల్చర్, ఫార్మసీ విభాగంలో 86,910 మంది పరీక్షలకు హాజరు కానున్నారు. పరీక్షలు ఆన్‌లైన్‌లో జరగుతాయి. ప‌రీక్ష హాల్‌లోకి గంట ముందే చేరుకోవాల‌ని నిర్వ‌హ‌కులు సూచించారు. అభ్య‌ర్దుల కోసం ప్ర‌త్యేక సదుపాయాలు..ర‌వాణా ఏర్పాట్లు చేసారు.

పరీక్షకు హాజరయ్యే వారికి పలు నిబంధనలు విధించారు అధికారులు. బయోమెట్రిక్ విధానం ద్వారా వేలి ముద్రను, ఫొటోను స్వీకరించనున్నారు. కాలిక్యులేటర్లు, స్మార్ట్ వాచీలు, ఎలక్ట్రానిక్ పరికరాలను తీసుక రావద్దని సూచించారు. పరీక్ష ప్రారంభానికి ముందు కంప్యూటర్లో ఇవ్వబడిన సూచనలను చదివేందుకు 15 నిమిషాలు మాత్రమే కేటాయిస్తామని అధికారులు స్పష్టం చేశారు. 

ఇంజనీరింగ్ పరీక్షకు సంబంధించి ప్రాథమిక కీని ఈనెల 23న విడుదల చేయనున్నారు. అగ్రికల్చర్, మెడికల్ ప్రవేశ ప్రరీక్ష కీ ని ఏప్రిల్ 24న రిలీజ్ చేస్తారు. పరీక్షా ఫలితాలను మే రెండో వారంలో విడుదల చేస్తారని తెలుస్తోంది.