AP EdCET Results: ఏపీ ఎడ్‌సెట్ ఫ‌లితాలు విడుద‌ల‌.. రిజల్ట్స్ ఇలా తెలుసుకోండి

AP EdCET Results: ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేష‌న్ కామ‌న్ ఎంట్రన్స్ టెస్ట్ ఫ‌లితాలు విడుదల అయ్యాయి.

AP EdCET Results: ఏపీ ఎడ్‌సెట్ ఫ‌లితాలు విడుద‌ల‌.. రిజల్ట్స్ ఇలా తెలుసుకోండి

Ap edcet results

Updated On : June 20, 2025 / 4:02 PM IST

ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేష‌న్ కామ‌న్ ఎంట్రన్స్ టెస్ట్ ఫ‌లితాలు విడుదల అయ్యాయి. దీనికి సంబంధించిన వివరాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఓ ప్రకటనలో వెల్లడించారు. 5 విభాగాల్లో కలిపి మొత్తం 99.42 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు ఆయన తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 17,795 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా వారిలో 14,527 మంది ఉత్తీర్ణత సాధించారు.

మీ ఫ‌లితాల‌ను ఇలా తెలుసుకోండి:

  • ముందుగా అధికారిక వెబ్ సైట్ https://cets.apsche.ap.gov.in/EDCET/Edcet/ లోకి వెళ్లాలి.
  • ఎడ్ సెట్ – 2025 ఫలితాల ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
  • రిజిస్ట్రేష‌న్ నంబ‌ర్‌, ఎడ్‌సెట్ హాల్ టికెట్ నెంబ‌ర్, పుట్టిన తేదీ వివరాలను ఎంట‌ర్ చేసి సబ్మిట్ బ‌ట‌న్‌పై క్లిక్ చేయాలి.
  • ఫ‌లితాలు డిస్ ప్లే అవుతాయి.
  • ప్రింట్ లేదా డౌన్లోడ్ చేసుకోవాలి.

మనమిత్ర వాట్సాప్ లో ఇలా చెక్ చేసుకోవాలి:

  • ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మనమిత్ర వాట్సాప్ ద్వారా కూడా ఏపీ ఎడ్ సెట్ రిజల్ట్స్ తెలుసుకోవచ్చు.
  • ముందుగా ఏపీ వాట్సాప్ గవర్నెన్స్ నెంబర్ 9552300009 కు ‘Hi’ అని మెసేజ్ చేయాలి.
  • తర్వాత ‘సెలెక్ట్ సర్వీస్’ లో ‘విద్యా సేవలు’ ఆప్షన్ ఎంచుకోవాలి.
  • ఏపీ ఎడ్ సెట్ ఫలితాలు – 2025 ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
  • హాల్ టికెట్ నెంబర్, రిజిస్ట్రేష్ నెంబర్ ను ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి.
  • మీ ర్యాంక్ కార్డు డిస్లే అవుతుంది.