అప్లయ్ చేసుకోండి: ఇంటర్‌ అర్హతతో ప్రభుత్వ ఉద్యోగం, జీతం రూ.49వేలు

  • Published By: veegamteam ,Published On : March 5, 2019 / 03:50 AM IST
అప్లయ్ చేసుకోండి: ఇంటర్‌ అర్హతతో ప్రభుత్వ ఉద్యోగం, జీతం రూ.49వేలు

Updated On : March 5, 2019 / 3:50 AM IST

నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఏపీ అటవీశాఖలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెట్ బీట్ ఆఫీసర్ పోస్టులు భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు ఫిబ్రవరి 12న ఏపీపీఎస్సీ నుంచి నోటిఫికేషన్ విడుదల  కాగా, ఉద్యోగాల దరఖాస్తు ప్రక్రియ మంగళవారం(మార్చి-5.2019) నుంచి ప్రారంభమైంది. దరఖాస్తులకు మార్చి 27 చివరి తేదీ. మార్చి 26లోపే పరీక్ష ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఏపీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌ psc.ap.gov.inలో వివరాలు నమోదు చేసి అటవీశాఖ ఉద్యోగాలకు అప్లయ్ చేయొచ్చు.

మే 26న ప్రాథమిక రాతపరీక్ష నిర్వహించే అవకాశముంది. అందులో అర్హత సాధించిన అభ్యర్థులకు ఆగస్టులో మెయిన్స్ పరీక్ష నిర్వహిస్తారు. మెయిన్ పరీక్షను ఆన్‌లైన్ విధానంలో నిర్వహిస్తారు. స్క్రీనింగ్ పరీక్షను(రాత పరీక్ష) ఆఫ్‌లైన్ ద్వారా నిర్వహించనున్నారు. ఒకవేళ స్క్రీనింగ్ పరీక్ష రాసే అభ్యర్థుల సంఖ్య 25వేలు దాటితే.. వారికి కూడా ఆన్‌‌లైన్ విధానంలోనే పరీక్ష నిర్వహిస్తారు. ఇంటర్ అర్హత ఉండి 18-30 సంవత్సరాల మధ్య వయసున్నవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు దరఖాస్తు ప్రాసెసింగ్ ఫీజుగా రూ.250, పరీక్ష ఫీజుగా రూ.80  చెల్లించి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

మొత్తం పోస్టులు: 430
ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్-330 (క్యారీ ఫార్వర్డ్ 17+ ఫ్రెష్ 313)
అసిస్టెంట్‌ బీట్‌ ఆఫీసర్-100 (క్యారీ ఫార్వర్డ్ 9+ ఫ్రెష్ 91)
పాతవి 26+కొత్తవి 404

అర్హత‌: ఇంట‌ర్, నిర్దిష్ట శారీర‌క ప్రమాణాలు త‌ప్పనిస‌రి
వ‌య‌సు: 01.07.2019 నాటికి 18 నుంచి 30 సంవత్సరాల మ‌ధ్య ఉండాలి.
దరఖాస్తు ఫీజు: అభ్యర్థులు దరఖాస్తు ప్రాసెసింగ్ ఫీజుగా రూ.250, పరీక్ష ఫీజుగా రూ.80 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, తెల్లరేషన్ కార్డుదారులకు, నిబంధనల ప్రకారం ఉన్న నిరుద్యోగులకు పరీక్ష  ఫీజు రూ.80 చెల్లించాల్సిన అవసరం లేదు. దరఖాస్తు ఫీజు మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక‌ విధానం: స్క్రీనింగ్ టెస్ట్, మెయిన్ ఎగ్జామినేషన్, దేహదారుఢ్య పరీక్షలు, వైద్య ప‌రీక్షల ద్వారా ఎంపిక

జీతం:
ఫారెస్ట్ బీట్ ఆఫీసర్- పే స్కేల్ (రూ.16,400 -49,870)

అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ -పే స్కేల్ (రూ.15,030 – 46,060)

నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి:

వెబ్‌సైట్ కోసం క్లిక్ చేయండి: