ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ హాల్‌టికెట్స్ రిలీజ్

ఆంధ్రప్రదేశ్ లో బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (BIEAP) ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లను రిలీజ్ చేసింది. విద్యార్థులు అధికార వెబ్‌సైట్ ద్వారా తమ హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మే 14 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభంకానున్నయి. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ విద్యార్ధులకు మే 14 నుంచి 22 వరకు సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించనున్నారు.
పరీక్ష సమయం:
ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్ధులకు ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు, సెకండ్ ఇయర్ విద్యార్ధులకు మధ్యాహ్నాం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. పరిక్ష సమయం కన్నా అరగంట ముందే విద్యార్ధులు పరీక్షా కేంధ్రానికి చేరుకోవాల్సి ఉంటుంది. పరీక్షకు 5 నిమిషాలు అలస్యమైనా పరీక్షకు అర్హత ఉండదు.