Inter Certificates : ఇంటర్ పాసైన విద్యార్థులకు ఏపి ఇంటర్ బోర్డ్ గుడ్ న్యూస్

ఈనెల 10వ తేది తరువాత నుండి ఒరిజినల్ సర్టిఫికెట్లను అందజేయనున్నట్లు ఇంటర్ బోర్డు ప్రకటించింది. సర్టిఫికెట్లు ముద్రణ తుదిదశకు చేరింది. వీటన్నింటిని 10 వతేదిలోపు ఆయా కళాశాలకు పంపనున్నారు.

Inter Certificates : ఇంటర్ పాసైన విద్యార్థులకు ఏపి ఇంటర్ బోర్డ్ గుడ్ న్యూస్

AP Inter Board

Updated On : October 7, 2023 / 10:20 AM IST

Inter Certificates : ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్‌ ఫలితాలు వచ్చి 5 నెలలు గడిచినా విద్యార్థులకు ఒరిజినల్‌ మెమోలు చేతికందలేదు. ఇప్పటికే వారు పై చదువుల కోసం చేరిన ఇంజనీరింగ్ , డిగ్రీ, ఐఐటీ కళాశాలలు ఒరిజినల్ మెమోలు ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నాయి. ఈ సర్టిఫికెట్ల కోసం సుమారు 3,75,000 మందికి పైగా విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. ఈ నేపధ్యంలో ఇంటర్ బోర్డు వీరందరికి తీపికబురందించింది.

READ ALSO : Red Gram : కందిలో మేలైన రకాలు.. అధిక దిగుబడుల కోసం శాస్త్రవేత్తల సూచనలు

ఈనెల 10వ తేది తరువాత నుండి ఒరిజినల్ సర్టిఫికెట్లను అందజేయనున్నట్లు ఇంటర్ బోర్డు ప్రకటించింది. సర్టిఫికెట్లు ముద్రణ తుదిదశకు చేరింది. వీటన్నింటిని 10 వతేదిలోపు ఆయా కళాశాలకు పంపనున్నారు. ఇప్పటికే ఇంటర్ బోర్డు వెబ్సైట్ నుంచి 3.73లక్షల మంది హాల్ టికెట్ ఆధారంగా మార్కుల మెమోలు పొందినట్లు ఇంటర్ బోర్డు వెల్లడించింది. 10 వతేది తరువాత ఆయా కళాశాలలకు వెళ్ళి విద్యార్ధులు ఒరిజినల్ సర్టిఫికెట్లను తీసుకోవచ్చని అధికారులు సూచించారు.

READ ALSO : TDP : చంద్రబాబుకి బెయిల్ రాకపోతే? 9వ తేదీ తర్వాత తెరపైకి అత్తాకోడళ్లు?

వాస్తవానికి ఇంటర్ విద్యార్ధులకు ఒరిజనల్ సర్టిఫికెట్లను ఆగస్టులోనే ఇవ్వాల్సి ఉంది. సర్టిఫికెట్లను ముద్రణకు ఇచ్చే విషయంలో ఇంటర్మీడియట్‌ విద్యా మండలిలో సమన్వయ లోపం జాప్యానికి కారణమైంది. దీంతో ఒరిజినల్‌ సర్టిఫికెట్లను సకాలంలో విద్యార్థులకు అందించలేకపోయారు. ఇదే విషయంపై అటు విద్యార్ధులతోపాటు, విద్యార్ధి సంఘాలు పలు మార్లు ఇంటర్మీడియట్‌ విద్యామండలికి వినతిపత్రాలు అందించాయి. అయితే తాజా ప్రకటనతో విద్యార్ధులు ఊపిరి పీల్చుకుంటున్నారు.