Red Gram : కందిలో మేలైన రకాలు.. అధిక దిగుబడుల కోసం శాస్త్రవేత్తల సూచనలు

ఖరీఫ్ తో పోల్చుకుంటే రబీలో విత్తన మోతాదు, సాళ్ల మధ్య తగిన దూరం పాటించటంలో జాగ్రత్త వహించాలి. ఖరీఫ్ తో పోలిస్తే రబీ పంట కాలం తగ్గుతుంది కాబట్టి మొక్కల సంఖ్యను పెంచుకుని సగటు దిగుబడిని మెరుగుపర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. 

Red Gram : కందిలో మేలైన రకాలు.. అధిక దిగుబడుల కోసం శాస్త్రవేత్తల సూచనలు

Red Gram

Updated On : October 7, 2023 / 9:16 AM IST

Red Gram : చూస్తుండగానే రబీకాలం వచ్చేసింది. నైరుతీ వర్షాలతో ముంచెత్తటంతో భూగర్భ జలాలు పెరిగి, చెరువులు కుంటల్లో పుష్కలంగా నీరు చేరింది. దీంతో రబీ సాగులో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. ప్రస్థుతం చాలమంది రైతులు రబీ కందిని సాగుచేసేందుకు సన్నద్ధమయ్యారు. అయితే ఆయాప్రాంతాలకు అనువైన రకాల ఎంపికతోపాటు సాగులో సమయానుకూలంగా యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే, ఎకరాకు 6 నుండి 10 క్వింటాళ్ళ వరకు దిగుబడులు పొందవచ్చు. కందిలో అధిక దిగుబడులను పొందేందుకు చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతుల గురించి తెలియజేస్తున్నారు ప్రధాన శాస్త్రవేత్త డా. జగన్ మోహన్ రావు.

READ ALSO : Natural Farming : జీవన ఎరువులు వాడుకునే విషయంలో రైతులు అనుసరించాల్సిన పద్ధతులు

తెలుగురాష్ట్రాల్లో సాగవుతున్న పప్పుదినుసుల పంటల్లో కంది ముఖ్యమైనది. రబీలో మూడు నాలుగు నీటి తడులు అందించే వసతి ఉన్న ప్రాంతాల్లో ఈ పంటను పండించుకోవచ్చు. తేలికపాటి నేలలు, మధ్యస్థ నేలలు, రేగడి నేలలు కందిసాగుకు అనుకూలం.  చౌడునేలలు, మురుగునీరు నిలిచే భూములు పనికిరావు. కందిని ఏకపంటగానే కాక పలు పంటల్లో అంతరపంటగా కూడా సాగుచేసుకునే అవకాశం వుంది.

READ ALSO : Weed Management : వరిపంటలో ఎరువులు, కలుపు యాజమాన్యం

ఎకరాకు 8 నుండి 10క్వింటాళ్ల దిగుబడి సాధించే అవకాశం ఉన్నా, మన రైతులు మాత్రం  కేవలం ఐదారు క్వింటాళ్ల దిగుబడిని మాత్రమే పొందుతున్నారు. రబీ కందిని అక్టోబర్ 15 వరకు విత్తుకోవచ్చు. సకాలంలో విత్తడం ఒకఎత్తైతే. ఆయా ప్రాంతాలకు అనువైన రకాలను ఎంపిక చేసుకోవడం మరో ఎత్తు. రబీ కంది సాగుకు ఏయే రకాలు అనుకూలం, వాటి గుణగణాలు ఏవిధంగా వున్నాయో తెలియజేస్తున్నారు.

ఖరీఫ్ తో పోల్చుకుంటే రబీలో విత్తన మోతాదు, సాళ్ల మధ్య తగిన దూరం పాటించటంలో జాగ్రత్త వహించాలి. ఖరీఫ్ తో పోలిస్తే రబీ పంట కాలం తగ్గుతుంది కాబట్టి మొక్కల సంఖ్యను పెంచుకుని సగటు దిగుబడిని మెరుగుపర్చుకోవడానికి అవకాశం ఉంటుంది.  మరోవైపు విత్తిన 24 నుండి 48 గంటల్లోపు కలుపు నివారణ చర్యలు చేపడితే, మొక్కలు ఆరోగ్యంగా పెరిగి , అధిక దిగుబడులు వచ్చే అవకాశం ఉంటుంది.

READ ALSO : Lady’s Finger Cultivation : బెండ సాగుకు సిద్ధమవుతున్న రైతులు.. ఎరువులు, కలుపు యాజమాన్యం చేపడితేనే అధిక దిగుబడులు

ఖరీఫ్ కు అనువైన రకాలన్నీ రబీలో సాగుచేసుకునే వెసులుబాటు ఉంది. ముఖ్యంగా 160 నుండి 180 రోజుల పంటకాలం కలిగిన ఖరీఫ్  రకాలను రబీలో వేసుకున్నట్లైతే సుమారు 140 నుండి 145 రోజుల్లో పంటకాలం పూర్తవుతుంది. ఎకరాకు 6 నుండి 7 క్వింటాళ్ల దిగుబడిని సాధించవచ్చు. ఖరీప్ లో వేసే స్వల్ఫకాలిక రకాలను రబీలో వేయకూడదు. రబీలో వేస్తే పంట కాలం మరింత తగ్గి , దిగుబడులు తగ్గే అవకాశం ఉంది. కాబట్టి సిఫార్సు చేసిన రకాలను మాత్రమే రైతులు  ఎన్నుకొని సాగుచేసినట్లైతే మంచి దిగుబడిని సాధించడానికి అవకాశం ఉంటుంది.