Ap Lawcet Results: ఏపీ లాసెట్ ఫలితాలు విడుదల.. మీ రిజల్ట్స్ ఇలా తెలుసుకోండి

ఏపీ లాసెట్ - 2025 ఫలితాలు విడుదల అయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 27,253 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 20,826 మంది అభ్యర్థులు అర్హత సాధించారు.

Ap Lawcet Results: ఏపీ లాసెట్ ఫలితాలు విడుదల.. మీ రిజల్ట్స్ ఇలా తెలుసుకోండి

Ap lawcet 2025

Updated On : June 19, 2025 / 5:59 PM IST

ఏపీ లాసెట్ – 2025 ఫలితాలు విడుదల అయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 27,253 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 20,826 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. ఈ విషయాన్నీ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ అధికారికంగా వెల్లడించారు. ఈ పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులు న్యాయ విద్య కాలేజీల్లోని మూడేళ్లు, ఐదేళ్లు, పీజీ కోర్సుల్లో అడ్మిషన్లు పొందుతారు. అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ cets.apsche.ap.gov.in/LAWCET/ లోకి వెళ్లి ఫలితాలను తెలుసుకోవచ్చు. మనమిత్ర వాట్సాప్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు.

మీ ఫలితాలు ఇలా చెక్ చేసుకోండి:

  • అభ్యర్థులు ముందుగా https://cets.apsche.ap.gov.in/LAWCET/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  • హోం పేజీలో లాసెట్ ఫలితాలపై క్లిక్ చేయాలి.
  • హాల్ టికెట్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్ ను ఎంటర్ చేయాలి.
  • సబ్మిట్ బట్టన్ పై క్లిక్ చేస్తే ర్యాంక్ కార్డు డిస్ ప్లే అవుతుంది.
  • దాన్ని ప్రింట్ లేదా డౌన్లోడ్ చేసుకోవాలి.

మనమిత్ర వాట్సాప్ లో ఇలా చేయండి:

  • ఏపీ వాట్సాప్ గవర్నెన్స్ నెంబర్ 9552300009 కు ‘Hi’ అని మెసేజ్ చేయాలి.
  • లిస్టులో ‘సెలెక్ట్ సర్వీస్’ లో ‘విద్యా సేవలు’ సెలెక్ట్ చేసుకోవాలి.
  • తరువాత ఏపీ లాసెట్ ఫలితాలు – 2025 పై క్లిక్ చేయాలి.
  • మీ ర్యాంక్ కార్డు స్క్రీన్ పై డిస్లే అవుతుంది.