వెబ్‌సైట్‌లో ‘ ఏపీ లాసెట్’ హాల్‌టికెట్లు

ఏపీలో న్యాయవిద్యకు సంబంధించి డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించారు. ఏపీలాసెట్, పీజీఎల్‌సెట్ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ నుంచి తమ హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్థులు లాసెట్ రిజిస్ట్రేషన్ నెంబర్, క్వాలిఫైయింగ్ పరీక్ష హాల్‌టికెట్ నెంబరు, పుట్టిన తేదీ వివరాలతో మీ హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
పరీక్ష కేంద్రాలు:
అనంతపురం, చిత్తూరు, తిరుపతి, కడప, కర్నూలు, నంద్యాల, నెల్లూరు, ఒంగోలు, గుంటూరు, విజయవాడ, భీమవరం, కాకినాడ, రాజమహేంద్రవరం, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం.
అర్హత మార్కులు ఇలా..
– ఏపీ లాసెట్‌లో అర్హత సాధించడానికి అభ్యర్థులు మొత్తం 120 మార్కులకు 42 మార్కులు సాధించాల్సి ఉంటుంది. SC, ST లకు ఎలాంటి అర్హత మార్కులు ఉండవు.
– ఏపీ పీజీలాసెట్‌లో అర్హత సాధించడానికి అభ్యర్థులు మొత్తం 120 మార్కులకు 30 మార్కులు సాధించాల్సి ఉంటుంది. SC, STలకు ఎలాంటి అర్హత మార్కులు ఉండవు.
పీజీఎల్‌సెట్ పరీక్ష విధానం..
పీజీలాసెట్ పరీక్షలో మొత్తం 120 మార్కులకు పీజీలాసెట్ పరీక్ష నిర్వహిస్తారు. 120 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నలకు ఒకమార్కు. పరీక్ష సమయం 90 నిమిషాలు.
లాసెట్ పరీక్ష విధానం..
లాసెట్ ప్రవేశ పరీక్ష ద్వారా మూడు, ఐదేళ్ల లా డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. పరీక్ష మొత్తం 120 మార్కులకు నిర్వహిస్తారు. 120 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు. ఇంగ్లిష్, తెలుగు భాషల్లో ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష సమయం 90 నిమిషాలు.
Also Read : టీఎస్ ఐసెట్ దరఖాస్తుల స్వీకరణ గడువు పొడిగింపు