AP PG-CET 2021: ఏపీ పీజీ సెట్ ఫలితాలు విడుదల..

ఏపీ పీజీసెట్ ఫలితాలని రాష్ట్ర విద్యాశాఖామంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ విడుదల చేశారు. పోస్టు గ్రాడ్యుయేషన్ తదితర కోర్సుల్లో నిర్వహించిన ప్రవేశ పరీక్ష ఫలితాలను రిలీజ్ చేశారు.

AP PG-CET 2021: ఏపీ పీజీసెట్ ఫలితాలని రాష్ట్ర విద్యాశాఖామంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ విడుదల చేశారు. పోస్టు గ్రాడ్యుయేషన్ తదితర కోర్సుల్లో నిర్వహించిన ప్రవేశ పరీక్ష ఫలితాలను మంగళవారం (నవంబర్ 9)న ఉన్నత విద్యామండలి కార్యాలయంలో మంత్రి సురేష్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తొలిసారిగా అన్ని యూనివర్సిటీలలో ప్రవేశాలకు ఒకే పీజీ సెట్ ఉన్నత విద్యామండలి నిర్వహించిందన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా అన్ని యూనివర్సిటీలలో పీజీ ప్రవేశాలకి ఒకే పీజీ సెట్ మొదటిసారిగా నిర్వహించామని మంత్రి సురేశ్ అన్నారు. ఆన్‌లైన్‌లో నిర్వహించిన ఈ పరీక్షాకు సంబంధించి ఫలితాలను రెండు వారాలలోనే ప్రకటించామని చెప్పారు. పీజీ ప్రవేశాలకు 39,856 మంది అప్లయ్ చేసుకోగా.. పీజీ ప్రవేశ పరీక్షకు 35,573 మంది హాజరయ్యారు. పరీక్ష రాసిన విద్యార్థుల్లో 24,164 మంది అర్హత సాధించారు. మొత్తంగా పీజీసెట్‌లో 87.62 శాతం మంది అర్హత సాధించారు. గతంలో అన్ని యూనివర్సిటీలకు ఒకే ప్రవేశ పరీక్ష ఉండకపోవడం వల్ల విద్యార్ధులు అనేక ఇబ్బందులు పడ్డారని మంత్రి సురేశ్ పేర్కొన్నారు. ఈ ప్రవేశ పరీక్ష వల్ల అర్హత సాధించిన విద్యార్ధులు తమకి ఇష్ణమైన కోర్సులలో నచ్చిన యూనివర్సిటీలో చేరవచ్చునని ఆయన తెలిపారు.

ఉన్నత విద్యలో సీఎం వైఎస్ జగన్ విప్లవాత్మకమైన మార్పులు చేపట్టారని, ప్రవేశపరీక్షలలో ఎటువంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా కట్డుదిట్టంగా విజయవంతంగా నిర్వహించామని మంత్రి సురేశ్ స్పష్టం చేశారు. ఇకపై రాష్ట్ర వ్యాప్తంగా అన్ని యూనివర్సిటీల్లోనూ ఒకే సిలబస్ అమలు చేస్తామని మంత్రి సురేశ్ పేర్కొన్నారు. పరీక్ష ఫలితాల విడుదల కార్యక్రమంలో ఉన్నత విద్యా మండలి చైర్మన్ హేమచంద్రారెడ్డి, వైస్ చైర్మన్ రామ్మోహనరావు, యోగి వేమన యూనివర్సిటీ విసి సూర్యకళావతి కూడా పాల్గొన్నారు.
Read Also :  New Rafale Report : రాహుల్..దీనికి సమాధానం చెప్పాల్సిందే,రాఫెల్ రగడ మళ్లీ స్టార్ట్

ట్రెండింగ్ వార్తలు