New Rafale Report : రాహుల్..దీనికి సమాధానం చెప్పాల్సిందే,రాఫెల్ రగడ మళ్లీ స్టార్ట్

  2007-2012 మధ్య యూపీఏ హయాంలో భారత్ కు రాఫెల్ యుద్ధవిమానాలను అమ్మే డీల్ కోసం సుషేన్ గుప్తా అనే ఓ మధ్యవర్తికి ఫ్రెంచ్ కంపెనీ దసాల్ట్ నుంచి కమిషన్లు చెల్లించబడ్డాయని తాజాగా

New Rafale Report :  రాహుల్..దీనికి సమాధానం చెప్పాల్సిందే,రాఫెల్ రగడ మళ్లీ స్టార్ట్

Rahu

Sambit Patra:      2007-2012 మధ్య యూపీఏ హయాంలో భారత్ కు రాఫెల్ యుద్ధవిమానాలను అమ్మే డీల్ కోసం సుషేన్ గుప్తా అనే ఓ మధ్యవర్తికి ఫ్రెంచ్ కంపెనీ దసాల్ట్ నుంచి కమిషన్లు చెల్లించబడ్డాయని తాజాగా ఫ్రెంచ్ మీడియాలో కొత్త రిపోర్ట్ బయటికొచ్చింది. అంతేకాకుండా దీనికి సంబంధించిన డాక్యుమెంట్లు అందుకున్నప్పటికీ ఈ ఆరోపణలపై దర్యాప్తు చేయడంలో సీబీఐ విఫలమైందని ఫ్రెంచ్ ఆన్ లైన్ మీడియా “మీడియాపార్ట్”తెలిపింది.

59వేల కోట్ల రూపాయల రాఫెల్ డీల్‌లో అవినీతి ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్న “మీడియాపార్ట్”… ఆరోపించిన చెల్లింపుల్లో ఎక్కువ భాగం 2013కి ముందు జరిగాయని పేర్కొంది. సుషేన్ గుప్తాకు రహస్య కమీషన్లు చెల్లించడానికి డస్సాల్ట్‌ తప్పుడు ఇన్‌వాయిస్‌లను సృష్టించినట్లు తెలిపింది. 2018 అక్టోబర్‌ నుంచి సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ వద్ద ఆధారాలు ఉన్నాయని, కానీ చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారని పేర్కొంది. 2002- 2006 మధ్య సుషేన్ గుప్తా యొక్క షెల్ కంపెనీకి 914,488 యూరోలు అందాయని సీబీఐ పొందిన ఇన్‌వాయిస్‌లు, బ్యాంక్ స్టేట్‌మెంట్‌లు కూడా చూపిస్తున్నాయని తెలిపింది. 2004 వరకు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే-1 అధికారంలో ఉన్న విషయం తెలిసిందే.

కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ 2004- 2014 మధ్య అధికారంలో ఉంది. యూపీఏ హయాంలో భారత వైమానిక దళం కోసం 126 రాఫెల్ విమానాలు కొనుగోలు చేయాలని కాంగ్రెస్ భావించినప్పటికీ అది వాస్తవరూపం దాల్చలేదు. చివరకి మోదీ హయాంలో 36 రాఫెల్ జెట్స్ కోసం ఒప్పందంపై సెప్టెంబర్ 23, 2016న భారత్ సంతకం చేసింది.

ఫ్రెంచ్ మీడియా కథనాల నేపథ్యంలో బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా మంగళవారం ఢిల్లీలో విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ…రాఫెల్ ఒప్పందం ఏ ప్రభుత్వ హయాంలో జరిగిందో తాజా రిపోర్ట్ లు వెల్లడిస్తున్నాయన్నారు. రాఫెల్ ఒప్పందంలో అవినీతి జరిగిందని ఫ్రెంచ్ మీడియా వెల్లడించిందని.. ఈ వ్యవహారమంతా 2007-2012 మధ్య కాలంలో జరిగిందని చెప్పారు. 2019 సాధారణ ఎన్నికలకు ముందు కాంగ్రెస్, ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ రాఫెల్ డీల్ విషయంలో మోదీ ప్రభుత్వం అవినీతికి పాల్పడిందంటూ నిరాధారమైన పుకార్లను ప్రచారం చేశారన్నారు.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి, బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ అనేక పత్రికా సమావేశాలను నిర్వహించిందని సంబిత్ పాత్ర గుర్తు చేశారు. ఫ్రాన్స్ మీడియాలో ప్రచురితమైన ఓ కథనంలో డసాల్ట్ ఏవియేషన్ చెల్లించిన దాదాపు రూ.65 కోట్ల కమిషన్ గురించి పేర్కొన్నారని తెలిపారు. ఎస్ఎం గుప్తా అనే వ్యక్తికి 7.5 మిలియన్ యూరోలు కమిషన్‌గా చెల్లించినట్లు ఈ కథనం పేర్కొన్నట్లు తెలిపారు. అగస్టా వెస్ట్‌ల్యాండ్ కేసులో కూడా గుప్తా పేరు వెలుగులోకి వచ్చిందన్నారు. ఇది కేవలం ఓ యాధృచ్ఛిక సంఘటన కాదని, కుట్ర దాగుందని అన్నారు. దీనిపై దర్యాప్తు జరగాలన్నారు.

ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (INC) అంటే ‘ఐ నీడ్ కమిషన్’ అని అర్థమని సంబిత్ పాత్ర విమర్శించారు. రాహుల్ గాంధీ ప్రస్తుతం ఇటలీలో ఉన్నట్లుందని, యూపీయే ప్రభుత్వ హయాంలో ఈ అవినీతి ఎలా జరిగిందో ఆయన ఆ దేశం నుంచి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. భారత వాయు సేనకు యుద్ధ విమానాల అవసరం ఉండగా, ఈ ఒప్పందాన్ని పదేళ్ళపాటు పెండింగ్‌లో పెట్టారని విమర్శించారు.

ALSO READ Puneeth Rajkumar : పునీత్‌ పేరుతో ఉచిత ఆస్పత్రి, పాఠశాల : గాలి జనార్దనరెడ్డి