జాబ్ పాయింట్ : ఏపీ సెరికల్చర్ ఆఫీసర్ పోస్టుల భర్తీ

ఏపీ సెరికల్చర్ సర్వీస్‌ విభాగంలో ఆఫీసర్ పోస్టుల భర్తీకి సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ బుధవారం(మార్చి-6-2019) ప్రారంభమైంది. అర్హతలు ఉన్న అభ్యర్థులు ఏపీపీఎస్సీ

  • Published By: veegamteam ,Published On : March 7, 2019 / 05:18 AM IST
జాబ్ పాయింట్ : ఏపీ సెరికల్చర్ ఆఫీసర్ పోస్టుల భర్తీ

ఏపీ సెరికల్చర్ సర్వీస్‌ విభాగంలో ఆఫీసర్ పోస్టుల భర్తీకి సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ బుధవారం(మార్చి-6-2019) ప్రారంభమైంది. అర్హతలు ఉన్న అభ్యర్థులు ఏపీపీఎస్సీ

ఏపీ సెరికల్చర్ సర్వీస్‌ విభాగంలో ఆఫీసర్ పోస్టుల భర్తీకి సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ బుధవారం(మార్చి-6-2019) ప్రారంభమైంది. అర్హతలు ఉన్న అభ్యర్థులు ఏపీపీఎస్సీ వెబ్‌సైట్  ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. సంబంధిత విభాగంలో మాస్టర్ డిగ్రీ పూర్తిచేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థుల వయసు 18 నుంచి 42 సంవత్సరాల మధ్య ఉండాలి. 2019, మార్చి 26లోగా పరీక్ష ఫీజు చెల్లించాలి. దరఖాస్తు ప్రాసెసింగ్ ఫీజు రూ.250, పరీక్ష ఫీజు రూ.120. ఎస్సీ, ఎస్టీ, బీసీ, తెల్లరేషన్ కార్డుదారులకు, నిబంధనల ప్రకారం ఉన్న నిరుద్యోగులకు పరీక్ష ఫీజు  చెల్లించాల్సిన అవసరం లేదు. దరఖాస్తు ఫీజు చెల్లిస్తే సరిపోతుంది. ఆన్‌లైన్‌లోనే ఫీజు చెల్లించాలి.

అప్లికేషన్ కోసం క్లిక్ చేయండి:

సెరికల్చర్ ఆఫీసర్ : 13 పోస్టులు

అర్హత‌: సంబంధిత విభాగంలో పీజీ డిగ్రీ ఉండాలి. అగ్రికల్చర్ డిగ్రీలో బోటనీ/జువాలజీ ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి. సెరికల్చర్‌లో పీజీ డిగ్రీ చదువుతున్న వారు లేదా పీజీ డిప్లొమా ఉన్నవారికి ప్రాధాన్యం.

వ‌య‌సు: 01.07.2019 నాటికి 18 నుంచి 42 సంవత్సరాల మ‌ధ్య ఉండాలి.

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం 06.03.2019
ఫీజు చెల్లించడానికి చివరి తేదీ 26.03.2019.
దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ 27.03.2019.
మెయిన్ పరీక్ష తేదీ మే 21, 22 తేదీల్లో

వెబ్ సైట్ కోసం క్లిక్ చేయండి