ఏపీ టెన్త్ ఫలితాల విడుదలకు ఏర్పాట్లు పూర్తి
bse.ap.gov.in ఓపెన్ చేసి, చెక్ చేసుకోండి..

ఆంధ్రప్రదేశ్‌లో టెన్త్ క్లాస్ పరీక్షల ఫలితాలను బుధవారం ఉదయం 10 గంటలకు రిలీజ్ చేయనున్నారు. ఈ మేరకు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కేవీ శ్రీనివాసులురెడ్డి ఓ ప్రకటనలో వివరాలు తెలిపారు. ఫలితాలను 10tv.in, bse.ap.gov.in, apopenschool.ap.gov.inలో చెక్ చేసుకోవచ్చు. అలాగే, ‘మన మిత్ర’ వాట్సాప్ లేదా లీప్ మొబైల్ యాప్‌లలోనూ చూసుకోవచ్చు.
వాట్సాప్ ద్వారా ఇలా చెక్ చేసుకోండి
95523 00009కి హాయ్ అని మెసేజ్ పంపండి
ఆ తర్వాత విద్యా సేవలను సెలెక్ట్ చేయండి
ఎస్‌ఎస్‌సీ పబ్లిక్ పరీక్షల ఫలితాలపై క్లిక్ చేయండి
విద్యార్థి రోల్ నంబరు ఎంటర్ చేయండి
ఫలితాలు పీడీఎఫ్ రూపంలో వస్తాయి
ఇలా కూడా చెక్ చేసుకోవచ్చు
bse.ap.gov.in ఓపెన్ చేయండి
హాల్ టికెట్ నంబరు ఎంటర్ చేయండి
ఫలితాలు వచ్చేస్తాయి
ప్రింట్ తీసి పెట్టుకోండి