Apsfc Recruitment : ఏపీ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్లో పలు పోస్టుల భర్తీ
అభ్యర్ధులను ఆన్లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు మేనేజర్ పోస్టులకు రూ.1,01,970 నుండి 1,74,790; డిప్యూటీ మేనేజర్ పోస్టులకు రూ.76,730 నుండి1,62,780; అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు రూ.54,060 నుండి 1,40,540 వరకు జీతంగా చెల్లిస్తారు.

AP State Financial Corporation
Apsfc Recruitment : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన విజయవాడలోని ఏపీ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్లో పలు పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన ద్వారా మొత్తం 14 ఖాళీలను భర్తీ చేయనున్నారు. భర్తీ చేయనున్న పోస్టుల్లో మేనేజర్ (ఫైనాన్స్), డిప్యూటీ మేనేజర్ (ఫైనాన్స్), అసిస్టెంట్ మేనేజర్ (ఫైనాన్స్, లా) తదిర పోస్టులు ఉన్నాయి.
READ ALSO : Healthy Aging : ఆరోగ్యకరమైన వృద్ధాప్యాన్ని కొనసాగించటానికి నిపుణులు సూచిస్తున్న మార్గాలు !
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో సీఏ/ సీఎంఏ లేదా బీఈ, బీటెక్, ఎంబీబీఎస్, పీజీడీఎం, డిగ్రీ/ పీజీ (లా ఇన్ బిజినెస్, కమర్షియల్ లాస్) లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కలిగి ఉండాలి. అభ్యర్ధుల వయసు ఏప్రిల్ 1, 2023వ తేదీనాటికి 21 నుంచి 34 సంవత్సరాల మధ్య ఉండాలి.
అభ్యర్ధులను ఆన్లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు మేనేజర్ పోస్టులకు రూ.1,01,970 నుండి 1,74,790; డిప్యూటీ మేనేజర్ పోస్టులకు రూ.76,730 నుండి1,62,780; అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు రూ.54,060 నుండి 1,40,540 వరకు జీతంగా చెల్లిస్తారు.
READ ALSO : Antidepressants : దీర్ఘకాలిక నొప్పిని తగ్గించడంలో యాంటిడిప్రెసెంట్స్ పాత్రపై తాజా అధ్యయనంలో ఏం తేలిందంటే ?
ఈ అర్హతలున్నవారు ఆన్‌లైన్ విధానంలో మే 15, 2023వ తేదీలోపు దరఖాస్తులు పంపాల్సి ఉంటుంది. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్ వివరాలకోసం వెబ్ సైట్ ; https://esfc.ap.gov.in పరిశీలించగలరు.