AP TET 2024 Exams : ఫిబ్రవరి 27 నుంచే ఏపీ టెట్ పరీక్షలు.. పరీక్ష సమయం, తేదీలివే..!

AP TET 2024 Exams : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టెట్ పరీక్షలు ఫిబ్రవరి 27 నుంచి ప్రారంభం కానున్నాయి. టెట్ పరీక్షకు సంబంధించి తేదీలు, సమయం, ఇతర వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

AP TET 2024 Exams : ఫిబ్రవరి 27 నుంచే ఏపీ టెట్ పరీక్షలు.. పరీక్ష సమయం, తేదీలివే..!

AP TET 2024 Exams to be started from Feb 27,2024

AP TET 2024 Exams 2024 : ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ (AP TET-2024) పరీక్షలు ఫిబ్రవరి 27 నుంచి ప్రారంభం కానున్నాయి. ఆన్‌లైన్ ద్వారా నిర్వహించే ఈ టెట్ పరీక్షలకు 2,67,559 మంది అభ్యర్థులు హాజరు కానున్నారు. అయితే, పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు అధికారులు అన్ని ఏర్పాటు చేసినట్టు తెలిపారు.

Read Also : AP-TET Hall Ticket Download 2024 : ఏపీ టెట్ పరీక్ష హాల్ టికెట్లు విడుదల.. ఈ లింక్ ద్వారా ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి!

మార్చి 6 వరకు రెండు సెషన్లలో టెట్ పరీక్షలను నిర్వహించనున్నట్టు ఏపీ విద్యాశాఖ ఇప్పటికే ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 120 పరీక్షా కేంద్రాల్లో అన్ని వసతులతో ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు మొదటి సెషన్, మధ్యాహ్నాం 2.30 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు రెండో సెషన్‌లో టెట్ పరీక్షలను నిర్వహించనున్నారు. టెట్ పరీక్ష కోసం హాజరయ్యే అభ్యర్థులు అర్ధగంట ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని అధికారులు సూచించారు.

ఏపీ సహా ఇతర రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు :
టెట్‌ పరీక్ష కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) విధానంలో నిర్వహించనున్నారు. ఏపీతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ టెట్ పరీక్షా కేంద్రాల్ని ఏర్పాటు చేసినట్టు అధికారులు పేర్కొన్నారు. తెలంగాణాలో మూడు పరీక్షా కేంద్రాలు, కర్ణాటకలో నాలుగు పరీక్షా కేంద్రాలు, తమిళనాడులో రెండు, ఒడిశా రాష్ట్రంలో రెండు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు.

ఈ పరీక్షలను పర్యవేక్షించేందుకు 26 మంది సీనియర్‌ అధికారుల్ని కూడా నియమించారు. పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసేందుకు 29 ఫ్లైయింగ్ స్క్వాడ్‌లను కూడా ఏర్పాటు చేశారు. గర్బిణీ అభ్యర్ధులకి సమీప పరీక్షా కేంద్రాలలో హాజరయ్యేందుకు అవకాశం కల్పించారు. షెడ్యూల్‌ ప్రకారం.. మార్చి 10వ తేదీన ప్రాథమిక కీ రిలీజ్ చేయనున్నారు. ఆ తర్వాత మార్చి 14వ తేదీన టెట్ పరీక్షా తుది ఫలితాలు వెల్లడి కానున్నాయి.

పరీక్షా తేదీ వివరాలివే : 

  • పేపర్ 1ఎ : 27.02.2024 నుంచి 01.03. 2024 వరకు
  • పేపర్ 2ఎ : 02.03.2024 నుంచి 04.03.2024, 06.03.2024
  • పేపర్ 1బి : 05.03.2024 (FN)
  • పేపర్ 2బి : 05.03.2024 (AN)

* తెలంగాణ మూడు పరీక్షా కేంద్రాల్లో ఐఓఎన్ డిజిటల్ జోన్ ఐడీజెడ్ కర్మన్‌ఘాట్ (హైదరాబాద్), దరిపల్లి అనంత రాములు కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ & టెక్నాలజీ (ఖమ్మం), సనా ఇంజినీరింగ్ కళాశాల (కోదాడ).
* కర్నాటక రాష్ట్రంలో ఐఓఎన్ డిజిటల్ జోన్ ఐడీజెడ్ ఐడీజెడ్ తీగలపాళ్య ప్రధాన రహదారి (బెంగళూరు), (BITBYTECH) సొల్యూషన్స్ (బెంగుళూరు), అరైజ్ టెక్నాలజీస్ సెంటర్ (I) (బెంగళూరు).
* తమిళనాడులో ఐఓఎన్ డిజిటల్ జోన్ ఐడీజెడ్ కోవిలంబాక్కం (చెన్నై), (S.I.V.E.T) కళాశాల (చెన్నై).
* ఒడిశాలో iON డిజిటల్ జోన్ iDZ ఖల్లికోట్ కళాశాల ప్రాంతం (బరంపురం), SMIT డిగ్రీ ఇంజనీరింగ్ కళాశాల (బరంపురం).

Read Also : AP TET 2024 Registration : ఏపీ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2024 రిజిస్ట్రేషన్.. ఈరోజే లాస్ట్.. ఇప్పుడే అప్లయ్ చేసుకోండి!