ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల షెడ్యూల్‌ రిలీజ్‌.. హాల్‌టికెట్‌ ఇలా డౌన్‌లోడ్‌ చేసుకోండి..

https://applications-psc.ap.gov.in/Download_HallTickets/ ఓపెన్ చేయండి

ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల షెడ్యూల్‌ రిలీజ్‌.. హాల్‌టికెట్‌ ఇలా డౌన్‌లోడ్‌ చేసుకోండి..

Updated On : April 22, 2025 / 7:46 AM IST

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేసింది. ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు ఈ మెయిన్స్ పరీక్షలు నిర్వహించనున్నారు. మే 3 నుంచి మే 9 వరకు గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలను నిర్వహిస్తామని అధికారులు తెలిపారు. ప్రతి రోజు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్షలు ఉంటాయి.

తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు ఇక్కడ చెక్‌ చేసుకోండి

పరీక్షల వివరాలు
మే 3 : తెలుగు (అర్హత పరీక్ష)
మే 4 : ఇంగ్లీష్ (అర్హత పరీక్ష)
మే 5 : పేపర్-I: జనరల్ ఎస్సే
మే 6 : పేపర్-II: భారతదేశం, ఆంధ్రప్రదేశ్ చరిత్ర, సంస్కృతి, భూగోళశాస్త్రం
మే 7 : పేపర్-III: పాలిటీ, రాజ్యాంగం, పరిపాలన, చట్టం
మే 8 : పేపర్-IV: భారతదేశం, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ , అభివృద్ధి
మే 9: పేపర్-V: సైన్స్, టెక్నాలజీ , పర్యావరణ సమస్యలు

హాల్‌టికెట్‌ ఇలా డౌన్‌లోడ్‌ చేసుకోండి 

  • https://applications-psc.ap.gov.in/Download_HallTickets/ ఓపెన్ చేయండి
  • OTPR ID ఎంటర్ చేయండి
  • పాస్‌వర్డ్‌ టైప్‌ చేయండి
  • క్యాప్యాను టైప్‌ చేయండి
  • హాల్‌టికెట్ వస్తుంది
  • ప్రింట్ తీసుకుని పెట్టుకోండి