APPSC Group 2 Prelims Results : ఏపీపీఎస్సీ గ్రూప్ -2 ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాలు విడుదల.. మెయిన్స్ పరీక్ష ఎప్పుడంటే?

APPSC Group 2 Prelims Results : ఏపీపీఎస్సీ గ్రూప్ -2 ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాలు విడుదల.. మెయిన్స్ పరీక్ష ఎప్పుడంటే?

APPSC Group 2 Result 2024

APPSC Group 2 Prelims Results : ఏపీపీఎస్సీ గ్రూప్ -2 ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాలు బుధవారం (ఏప్రిల్ 10)న విడుదలయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది అభ్యర్థులు ఎంతో ఉత్కంఠతో ఏపీపీఎస్సీ పరీక్ష ఫలితాల కోసం ఎదురుచూస్తున్న వేళ.. ఎట్టకేలకు ఏపీపీఎస్సీ గ్రూప్‌ 2 ప్రిలిమ్స్ రిజల్ట్స్ 1:100 నిష్పత్తిలో ప్రకటించింది. ఎన్నడూ లేని రీతిలో రికార్డు స్ధాయిలో 7 వారాల్లోనే గ్రూప్‌-2 ప్రిలిమ్స్ ఫలితాలను విడుదల చేసింది.

Read Also : IIT Madras Technical Courses : విద్యార్థులకు ఐఐటీ మద్రాసు ఆఫర్.. 11 ప్రాంతీయ భాషల్లో 198 టెక్నికల్ కోర్సులు..!

రాష్ట్రంలో మొత్తం 899 గ్రూప్-2 ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఏపీపీఎస్సీ డిసెంబర్ 21 నుంచి జనవరి 17 వరకు దరఖాస్తులు స్వీకరించింది. గత ఫిబ్రవరి 25న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించగా, 2023 డిసెంబర్ 7న గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల అయిన సంగతి తెలిసిందే.

92,250 మంది మెయిన్స్‌కు క్వాలిఫై :
899 ఖాళీలకు గ్రూప్-2 పరీక్షలను నిర్వహిస్తుండగా.. మొత్తం 4,04,037 మంది అభ్యర్ధులు గ్రూప్‌-2 ప్రిలిమ్స్‌ పరీక్షలు రాశారు. మొత్తంగా 92,250 మంది మెయిన్స్‌కు క్వాలిఫై అయ్యారు. అదేవిధంగా, ఈ పరీక్షకు హాజరైన 2,557 మంది అభ్యర్థుల్ని వేర్వేరు కారణాలతో రిజెక్ట్ చేశారు.

జులై 28న గ్రూపు-2 మెయిన్స్ పరీక్ష :
ఏపీపీఎస్సీ గ్రూపు 2 ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన అభ్యర్థులతో పాటు రిజెక్ట్ అయిన అభ్యర్థుల జాబితాలను వేర్వేరుగా అధికారులు విడుదల చేశారు. ఈ పరీక్షకు దాదాపు 4లక్షల మందికి పైగా అభ్యర్థులు హాజరు కాగా.. గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలు వచ్చే జులై 28న నిర్వహించనున్నారు. గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాలను కూడా ఏపీపీఎస్సీ ప్రకటించే అవకాశం ఉంది.

Read Also : IIT Madras Technical Courses : విద్యార్థులకు ఐఐటీ మద్రాసు ఆఫర్.. 11 ప్రాంతీయ భాషల్లో 198 టెక్నికల్ కోర్సులు..!