బీ రెడీ: రేపే APPSC గ్రూప్-2 పరీక్ష ‘కీ’

  • Published By: veegamteam ,Published On : May 6, 2019 / 09:13 AM IST
బీ రెడీ: రేపే APPSC గ్రూప్-2 పరీక్ష ‘కీ’

Updated On : May 6, 2019 / 9:13 AM IST

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ (APPSC) మే 5న 446 గ్రూప్-2 పోస్టుల భర్తీకి స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించిన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా పరీక్ష మొత్తం 727 పరీక్ష కేంద్రాల్లో నిర్వహించారు. గ్రూప్-2 పరీక్షలకు మొత్తం 2,95,036 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 2,28,263 మంది అభ్యర్థులు హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నారు. వీరిలో 77.92% మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు.  

గ్రూప్-2 ప్రాథమిక కీని APPSC అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు. ప్రిలిమ్స్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులను 1 : 12 నిష్పత్తిలో మెయిన్స్‌ పరీక్షలకు ఎంపిక చేస్తారు. వీరికి జులై 18, 19 తేదీల్లో కంప్యూటర్‌ బేస్డ్‌ విధానంలో మెయిన్స్ పరీక్షలు నిర్వహిస్తారు. మెయిన్స్‌లో అన్ని పేపర్లూ రాయాల్సిందే. ఏ ఒక్క పేపర్‌ రాయకపోయినా తర్వాత ఎంపికకు పరిగణనలోకి తీసుకోరు.