BOB Recruitment 2025: బ్యాంక్ అఫ్ బరోడాలో లోకల్ బ్యాంకు ఆఫీసర్ జాబ్స్.. గడువు ముగుస్తోంది.. వెంటనే అప్లై చేసుకోండి

BOB Recruitment 2025: బ్యాంక్ ఆఫ్ బరోడా(BOB) నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. తమ సంస్థలో దేశవ్యాప్తంగా ఉన్న మొత్తం 2500 పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది.

BOB Recruitment 2025: బ్యాంక్ అఫ్ బరోడాలో లోకల్ బ్యాంకు ఆఫీసర్ జాబ్స్.. గడువు ముగుస్తోంది.. వెంటనే అప్లై చేసుకోండి

Bank Of Baroda 2025 Notification Released

Updated On : July 19, 2025 / 4:28 PM IST

బ్యాంక్ ఆఫ్ బరోడా(BOB) నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. తమ సంస్థలో దేశవ్యాప్తంగా ఉన్న మొత్తం 2500 లోకల్ బ్యాంకు ఆఫీసర్ పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మేరకు ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు బ్యాంక్ ఆఫ్ బరోడా అధికారిక వెబ్సైట్ https://www.bankofbaroda.in/ ద్వారా అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబందించిన దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే మొదలవగా.. ఆగస్టు 3తో గడువు ముగియనుంది. కాబట్టి, అభ్యర్థులు వెంటనే అప్లై చేసుకోవాల్సిందిగా అధికారులు సూచిస్తున్నారు.

విద్యార్హత:

అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ, ఇన్స్టిట్యూట్ నుంచి గ్రాడ్యుయేట్ డిగ్రీని పూర్తి చేయాల్సి ఉంటుంది. చార్టర్డ్ అకౌంటెంట్, కాస్ట్ అకౌంటెంట్, ఇంజనీరింగ్ లేదా మెడికల్ వంటి వృత్తిపరమైన అర్హతలు ఉన్నవారు కూడా అప్లై చేసుకోవచ్చు.

అనుభవం:

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క రెండవ షెడ్యూల్‌ జాబితాలో చేర్చబడిన షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్ లేదా ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులో అధికారిగా కనీసం 1 సంవత్సరం పనిచేసి ఉండాలి.

ఎంపిక విధానం:

అభ్యర్థులకు ముందుగా ఆన్ లైన్ టెస్ట్ ఉంటుంది. తరువాత సైకోమెట్రిక్ అసెస్‌మెంట్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఉంటుంది. వీటిలో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన వారిని ఎంపిక చేస్తారు.

దరఖాస్తు రుసుము:

జనరల్, EWS, OBC అభ్యర్థులు రూ.850, SC, ST, PWD, మహిళలు, ఎక్స్ సర్వీస్మెన్స్ రూ.175 చెల్లించాల్సి ఉంటుంది.