24న బీసీ స్టడీ సర్కిల్ రాత పరీక్ష

హైదరాబాద్ : గ్రూప్-1, 2 ఉద్యోగాలకు సిద్ధమయ్యే బీసీ అభ్యర్థులకు బీసీ స్టడీ సర్కిల్ ద్వారా ఉచిత ఫౌండేషన్ కోర్సులు నిర్వహించనున్నట్లు డైరెక్టర్ బాలాచారి తెలిపారు. ఫౌండేషన్ కోర్సుకు అర్హులైన అభ్యర్ధులను రాతపరీక్ష ద్వారా ఎంపిక చేస్తామని, దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈ మార్చి 24న ఉ.11 గంటలకు సైదాబాద్‌లోని బీసీ స్టడీ సర్కిల్ కార్యాలయంలో రాత పరీక్ష నిర్వహిస్తామని, హాల్‌టికెట్లను వెబ్‌సైట్ ఉంచామన్నారు. రాత పరీక్షకు హాజరయ్యే్ అభ్యర్ధుల కోసం https://tsbcstudycircles.cgg.gov.in లో హాల్ టికెట్లు అందుబాటులో ఉంచామని ఆయన తెలిపారు.