BHEL Recruitment 2023 : భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్ లో అప్రెంటిస్ పోస్టుల భర్తీ

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 680 అప్రెంటీస్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్ విధానంలో వెబ్‌సైట్ www.bhel.comలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

BHEL Recruitment 2023

BHEL Recruitment 2023 : భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్ (BHEL) గ్రాడ్యుయేట్ అప్రెంటిస్, టెక్నీషియన్ అప్రెంటీస్, ట్రేడ్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 680 అప్రెంటీస్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్ విధానంలో వెబ్‌సైట్ www.bhel.comలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

READ ALSO : JNTUH Certificate Courses : JNTUHలో ఆన్ లైన్ సర్టిఫికెట్ కోర్సుల్లో ప్రవేశాలు

పూర్తి వివరాలు ;

అప్రెంటీస్ ఖాళీలు ; మొత్తం 680

ట్రేడ్ అప్పెంటిస్ ; 398 ఖాళీలు

గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ; 179 ఖాళీలు

టెక్నీషియన్ అప్రెంటిస్ ; 103 ఖాళీలు

READ ALSO : Heart Attack : ఏ రకమైన గుండె నొప్పి తీవ్రమైనది ? ఛాతీ నొప్పా లేదా గుండె నొప్పా తెలుసుకోవటం ఎలా?

అర్హత;

గ్రాడ్యుయేట్ అప్రెంటిస్: అభ్యర్థులకు కనీసం 70% మార్కులు మరియు SC/ST అభ్యర్థులకు కనీసం 60% మార్కులు, ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థ/విశ్వవిద్యాలయం నుండి. 2021, 2022 & 2023లో డిగ్రీ కోర్సులను పూర్తి చేసిన అభ్యర్థులు 2023లో అప్రెంటిస్‌షిప్ శిక్షణలో దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. డిస్టెన్స్ లెర్నింగ్/పార్ట్ టైమ్/ కరస్పాండెన్స్/శాండ్‌విచ్ కోర్సుల ద్వారా డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు అప్రెంటిస్ శిక్షణకు అనర్హులు.

ట్రేడ్ అప్రెంటిస్: NCVT/SCVT గుర్తింపు పొందిన సంస్థ నుండి గత మూడు సంవత్సరాలలో రెగ్యులర్ ఫుల్-టైమ్ ఉత్తీర్ణత , ITI ఉత్తీర్ణత కలిగి ఉండాలి. 2021, 2022 & 2023 సంవత్సరాల్లో ITI కోర్సును పూర్తి చేసిన అభ్యర్థులు 2023లో అప్రెంటిస్‌షిప్ శిక్షణలో దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. దూరవిద్య / పార్ట్‌టైమ్ / కరస్పాండెన్స్ / శాండ్‌విచ్ కోర్సుల ద్వారా ITI పూర్తి చేసిన అభ్యర్థులు అప్రెంటీస్ శిక్షణకు అనర్హులు.

READ ALSO : Apple Diet : 5 రోజుల ఆపిల్ డైట్ తో 5 కేజీల బరువు తగ్గటం ఎలాగంటే ! తప్పక తెలుసుకోవలసిన విషయాలు ఇవే ?

టెక్నీషియన్ అప్రెంటిస్: హైస్కూల్ ఉత్తీర్ణత , డిప్లొమా ఉత్తీర్ణత, ప్రభుత్వం నుండి గత మూడు సంవత్సరాల రెగ్యులర్ విద్యార్ధి అయి ఉండాలి. అభ్యర్థులకు కనీసం 70% మార్కులు, SC/ST అభ్యర్థులకు కనీసం 60% మార్కులు వచ్చి ఉండాలి. 2021, 2022 & 2023లో డిప్లొమా కోర్సులను పూర్తి చేసిన అభ్యర్థులు 2023లో అప్రెంటిస్‌షిప్ శిక్షణలో దరఖాస్తు చేసుకోవడానికి మాత్రమే అర్హులు. దూరవిద్య / పార్ట్‌టైమ్ / కరస్పాండెన్స్ / శాండ్‌విచ్ కోర్సుల ద్వారా డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు అప్రెంటిస్ శిక్షణకు అనర్హులు.

వయోపరిమితి ;

వయో పరిమితి 18 నుండి 27 సంవత్సరాల మధ్య ఉండాలి.

READ ALSO : రైతు నోటి దగ్గర ముద్ద లాక్కుంటారా..?

ఎంపిక విధానం ;

అర్హత పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా అసెస్‌మెంట్ టెస్ట్‌లో అభ్యర్థులు సాధించిన స్కోర్‌ల ఆధారంగా మెరిట్ జాబితా తయారు చేసి అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

READ ALSO : Revanth Reddy : ఆ ద్రోహులను ఇంటికి పంపితే తప్ప రైతులకు న్యాయం జరగదు.. ఈసీ నిర్ణయంపై రేవంత్ రియాక్షన్ ..

దరఖాస్తు గడువు ;

01 డిసెంబర్ 2023లోపు రిజిస్ట్రేషన్ ప్రక్రియను అభ్యర్ధులు పూర్తి చేసుకోవాలి.

పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; www.bhel.com. పరిశీలించగలరు.

ట్రెండింగ్ వార్తలు