Heart Attack : ఏ రకమైన గుండె నొప్పి తీవ్రమైనది ? ఛాతీ నొప్పా లేదా గుండె నొప్పా తెలుసుకోవటం ఎలా?

యాసిడ్ రిఫ్లక్స్, అజీర్ణం గుండె నొప్పి తరహాలో నొప్పిని కలిగిస్తాయి. శరీరంలో అసౌకర్యం కలుగుతుంది. యాసిడ్ రుచితోపాటు, గుండెల్లో మంట వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఛాతిభాగంలో కండరాలు లాగటం, పక్కటెముకల వాపు, ఛాతినొప్పి కారణం అవుతాయి.

Heart Attack : ఏ రకమైన గుండె నొప్పి తీవ్రమైనది ? ఛాతీ నొప్పా లేదా గుండె నొప్పా తెలుసుకోవటం ఎలా?

Heart Attack

Heart Attack : ఛాతీ నొప్పి అనేది చాలా మందిని ఆందోళనకు గురిచేస్తుంది. ఛాతీలో కలిగే ప్రతినొప్పి గుండె సమస్యకు సంకేతం కాకపోయినప్పటికీ , అజీర్ణం, కండరాలు లాగడం వంటి వాటి వల్ల కూడా ఈ తరహా నొప్పి వస్తుందన్న విషయం తెలుసుకోవాలి.

READ ALSO : Apple Diet : 5 రోజుల ఆపిల్ డైట్ తో 5 కేజీల బరువు తగ్గటం ఎలాగంటే ! తప్పక తెలుసుకోవలసిన విషయాలు ఇవే ?

ఛాతీ నొప్పి సంకేతాలు ;

ఛాతి నొప్పి తీవ్రమైనదిగా ఎప్పుడు భావించాలంటే ఛాతిలో నొప్పి తరుచుగా వస్తున్నా గుండె సమస్యలతో ముడిపడి ఉండే అవకాశాలు ఉంటాయి. అంతేకాకుండా ఛాతి భాగంలో బరువుగా అనిపించినా గుండెకు సంబంధించిన సమస్యగా భావించాలి.

చేతులు, మెడ, దవడ, వీపుపై భాగానికి జాలుగా నొప్పి వస్తుండటం, అసౌకర్యంగా అనిపించటం వంటి సంకేతాలు ఉంటే గుండె నొప్పికి దారితీసే ప్రమాదం ఉంటుందని గమనించాలి.

ఛాతీ నొప్పితో పాటు, శ్వాస ఆడకపోవటం అనిపిస్తే అది గుండెకు సంబంధించిన సమస్యగా గుర్తించాలి. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలుగుతుంటే తక్షణం శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంటుంది.

READ ALSO : Cinnamon Water Benefits : ఉదయం టీ, కాఫీలకు బదులు ఈ నీరు తీసుకుంటే షుగర్ కంట్రోల్ లో ఉండటంతోపాటు, గుండె ఆరోగ్యంగా ఉంటుంది !

హార్ట్ ఎటాక్ లక్షణాలను ఎలా గుర్తించాలి?

గుండెపోటు లక్షణాలకు సంబంధించి ఛాతీ నొప్పి, శ్వాసఆడకపోవటం, చెమట పట్టటం వంటివి ఏకకాలంలో జరిగితే వెంటనే వైద్య సహాయం తీసుకోవాల్సి ఉంటుంది. అదే సమయంలో వికారం , మైకము అనిపించడం, ముఖ్యంగా ఛాతీలో అసౌకర్యం కలగి ఉండటం కూడా గుండె సమస్యను సూచిస్తుంది. ఈ సంకేతాలపై శ్రద్ధ వహించటం మంచిది. అకస్మాత్తుగా అలసిపోవటం వంటివాటి వల్ల ఆప్రభావం గుండె పై పడే ప్రమాదం ఉంటుంది. చెప్పలేని అలసట, ముఖ్యంగా మహిళల్లో ఈ తరహా సంకేతాలు కనిపిస్తాయి.

READ ALSO : Heart Health in Winter : చలికాలంలో గుండె ఆరోగ్యాన్ని కాపాడు కోవాలంటే ?

తక్షణ సహాయం ఎప్పుడు తీసుకోవాలి ;

గుండెపోటు సమయంలో, ప్రతి సెకను చాలా కీలకమైనది. ఎంత త్వరగా వైద్య సహాయం తీసుకుంటే అంతత్వరగా ప్రాణాపాయం నుండి బయటపడేందుకు, త్వరగా కోలుకునేందుకు అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. ఇతర రకాల నొప్పుల్లా కాకుండా గుండె నొప్పి సాధారణంగా తగ్గేది కాదు. కాబట్టి వైద్యుల సూచనలు, సలహాలు పాటిస్తూ తగిన చికిత్స పొందటం మంచిది.

READ ALSO : Heart Healthy : బీట్‌రూట్ , బచ్చలికూర జ్యూస్ తో పాటు గుండెను ఆరోగ్యంగా ఉంచటంలో సహాయపడే 5 పానీయాలు !

గుండె నొప్పి, ఛాతీ నొప్పికి ఇతర కారణాలు ;

యాసిడ్ రిఫ్లక్స్, అజీర్ణం గుండె నొప్పి తరహాలో నొప్పిని కలిగిస్తాయి. శరీరంలో అసౌకర్యం కలుగుతుంది. యాసిడ్ రుచితోపాటు, గుండెల్లో మంట వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఛాతిభాగంలో కండరాలు లాగటం, పక్కటెముకల వాపు, ఛాతినొప్పి కారణం అవుతాయి. ఛాతీపై ఒత్తిడితో నొప్పి వస్తే అది గుండెకు సంబంధించినది కాదని గ్రహించాలి.

ఛాతీలో ఎలాంటి నొప్పి ఉన్నా వెంటనే వైద్య సహాయం తీసుకోవటం వల్ల పొంచిఉన్న ముప్పు నుండి బయటపడవచ్చు. అన్ని రకాల ఛాతీ నొప్పులు అత్యవసరం

గమనిక ; అందుబాటులో ఉన్న వివిధ మార్గాల ద్వారా ఈ సమాచారం సేకరించి అందించటమైనది కేవలం అవగాహన కోసం మాత్రమే.  ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు వైద్యులను సంప్రదించి తగిన సూచనలు, సలహాలు పొందటం మంచిది.