Bihar Teacher Recruitment : పేపర్ లీక్ కలకలం.. బీహార్ టీచర్ రిక్రూట్‌మెంట్ పరీక్ష రద్దు!

Bihar Teacher Recruitment : బీహార్ టీచర్ రిక్రూట్‌మెంట్ పరీక్ష పేపర్ లీక్ కలకలం సృష్టించింది. మార్చి 16న వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన ఎకనామిక్ అఫెన్స్ యూనిట్ బీహార్ దర్యాప్తు, చట్టపరమైన చర్యలను ప్రారంభించింది.

Bihar Teacher Recruitment : పేపర్ లీక్ కలకలం.. బీహార్ టీచర్ రిక్రూట్‌మెంట్ పరీక్ష రద్దు!

Bihar Teacher Recruitment Exam 2024 Cancelled After Paper Leak Allegations

Bihar Teacher Recruitment : బీహార్‌లో పేపర్ లీక్ కలకలం రేపింది. పేపర్ లీక్‌ల ఆరోపణల నేపథ్యంలో బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (BPSC) టీచర్ రిక్రూట్‌మెంట్ ఎగ్జామ్ 2024 (TRE 3.0) మూడో దశను రద్దు చేసింది. ఈ బీపీఎస్‌సీ పరీక్షను మార్చి 15న రెండు షిఫ్టులలో నిర్వహించింది.

Read Also : UPSC Prelims Reschedule : ఎన్నికల వేళ.. యూపీఎస్సీ ప్రిలిమ్స్ పరీక్ష వాయిదా.. జూన్ 16న పరీక్ష!

నివేదికల ప్రకారం.. పరీక్షకు సంబంధించిన ప్రశ్నపత్రాలు నిర్ణీత సమయానికి ముందే చేరుకున్నాయని ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనికి ప్రతిస్పందనగా, ఆర్థిక నేరాల విభాగం, బీహార్ పాట్నా.. మార్చి 16న వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, తదుపరి దర్యాప్తు, చట్టపరమైన చర్యలను ప్రారంభించింది.

పరీక్షకు ముందు ప్రశ్నపత్రం లీక్ అయినట్లు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొంది. జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత, పరీక్షా ప్రక్రియలో పారదర్శకత, సమగ్రతను కొనసాగించాలనే ఉద్దేశంతో బీపీఎస్‌సీ మార్చి 15, 2024న (TRE-3.0 రెండు షిఫ్ట్‌లు) జరిగిన టీచర్ పోటీ పరీక్షను రద్దు చేయాలని నిర్ణయించిందని అధికారిక ప్రకటన పేర్కొంది. అయితే, ఈ పరీక్షను నిర్వహించేందుకు కొత్త తేదీని త్వరలోనే ప్రకటిస్తామని బీపీఎస్‌సీ వెల్లడించింది.


Read Also : CBSE Boards Exam 2024 : పరీక్షల ఒత్తిడిని తగ్గించుకోవడానికి విద్యార్థులకు సీబీఎస్ఈ సూచనలు.. ఏం చేయాలి? ఏం చేయకూడదంటే?