BSF Recruitment 2025: బీఎస్ఎఫ్ రిక్రూట్‌మెంట్.. 3588 పోస్టులకు నోటిఫికేషన్.. జులై 26 నుంచి దరఖాస్తులు.. ముఖ్యమైన తేదీలు, పూర్తి వివరాలు

BSF Recruitment 2025: నిరుద్యోగులకు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ గుడ్ న్యూస్ చెప్పింది. కానిస్టేబుల్ ట్రేడ్స్‌మెన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

BSF Recruitment 2025: బీఎస్ఎఫ్ రిక్రూట్‌మెంట్.. 3588 పోస్టులకు నోటిఫికేషన్.. జులై 26 నుంచి దరఖాస్తులు.. ముఖ్యమైన తేదీలు, పూర్తి వివరాలు

BSF Constable Tradesman Recruitment Notification Released

Updated On : July 24, 2025 / 11:52 AM IST

నిరుద్యోగులకు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ గుడ్ న్యూస్ చెప్పింది. కానిస్టేబుల్ ట్రేడ్స్‌మెన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. జులై 26వ తేదీ నుంచి అధికారిక వెబ్ సైట్ bsf.gov.in నుంచి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ప్రక్రియ ఆగస్టు 25 వరకు కొనసాగనుంది. ఇక ఈ కానిస్టేబుల్ ట్రేడ్స్‌మెన్ రిక్రూట్‌మెంట్ లో భాగంగా మొత్తం 3588 ఖాళీలను భర్తీ చేయనున్నారు. వాటిలో పురుషులకు 3406 పోస్టులు కేటాయించగా.. 182 ఖాళీలను మహిళా అభ్యర్థుల కోసం కేటాయించారు. ఇక గ్రేడుల వారి పూర్తి వివరాల కోసం అధికారిక వబ సైట్ ను bsf.gov.in సంప్రదించవచ్చు.

వయోపరిమితి:
ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 18 నుంచి 25 ఏళ్ళ మధ్యలో ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు వయోపరిమితిలో 5 ఏళ్లు సడలింపు ఉంటుంది.

ఎంపిక విధానం:
ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ట్రేడ్ టెస్ట్, రాత పరీక్ష, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక జరుగుతుంది.

దరఖాస్తు ఇలా చేసుకోండి:

  • ముందుగా అధికారిక వెబ్ సైట్ rectt.bsf.gov.in లోకి వెళ్ళాలి
  • హోమ్ పేజీలో వన్ టైమ్ రిజిస్ట్రేషన్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి
  • పేరు, మొబైల్ నంబర్, ఇమెయిల్ ఐడీ డీటెయిల్స్ తో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి
  • క్రియేట్ చేసిన క్రెడెన్షియల్స్ తో లాగిన్ అవ్వాలి
  • తరువాత ఆన్లైన్ అప్లికేషన్ విభాగాన్ని యాక్సెస్ చేసుకోవాలి
  • అవసరమైన వివరాలతో ఆన్లైన్ అప్లికేషన్ ఫారం ఫిల్ చేయాలి.
  • అవసరమైన డాక్యుమెంట్లను అప్లోడ్ చేయాలి.
  • ప్లికేషన్ ఫీజు చెల్లించి సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయాలి.
  • ఫిల్ చేసిన ఫారంను తదుపరి అవసరాల కోసం సేవ్ లేదా డౌన్లోడ్ చేసుకోవాలి