Central bank of India recruitment 2023 : సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీ… దరఖాస్తుకు సమీపించిన గడువు

దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు భారతదేశంలోని ఏదైనా గుర్తింపు పొందిన సంస్థ నుండి B.Tech, MBA, MCA, డిప్లొమా, బ్యాచిలర్ డిగ్రీ, B.Sc., మాస్టర్ డిగ్రీని కలిగి ఉండాలి. పోస్టులవారిగా వేర్వేరు విద్యార్హతలు నిర్దేశించారు. అభ్యర్థులు నోటిఫికేషన్‌ను పరిశీలించి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

Central bank of India recruitment 2023 : సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో  స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీ… దరఖాస్తుకు సమీపించిన గడువు

Central Bank of India Recruitment 2023

Updated On : November 17, 2023 / 1:17 PM IST

Central bank of India recruitment 2023 : సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (CBI) స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీ చేపట్టనుంది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా మొత్తం 192 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ 28 అక్టోబర్ 2023 నుండి ప్రారంభమైంది. నవంబర్ 19 దరఖాస్తులకు చివరితేదిగా నిర్ణయించారు. దరఖాస్తుకు గడువు సమీపిస్తున్న తరుణంలో అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://centralbankofindia.co.in/ద్వారా ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

READ ALSO : Anil Ravipudi : రాజకీయ నాయకుడిగా మరోబోతున్న డైరెక్టర్.. అనిల్ రావిపూడి కొత్త అవతారం..

అర్హతలు :

దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు భారతదేశంలోని ఏదైనా గుర్తింపు పొందిన సంస్థ నుండి B.Tech, MBA, MCA, డిప్లొమా, బ్యాచిలర్ డిగ్రీ, B.Sc., మాస్టర్ డిగ్రీని కలిగి ఉండాలి. పోస్టులవారిగా వేర్వేరు విద్యార్హతలు నిర్దేశించారు. అభ్యర్థులు నోటిఫికేషన్‌ను పరిశీలించి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

వయోపరిమితి :

అభ్యర్థి వయస్సు 20 నుండి 28 సంవత్సరాలు మధ్య ఉండాలి. షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగలకు చెందిన అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.

READ ALSO : DUEL BIG FIGHT : తెలంగాణలో మూడు పార్టీల కీలకనేతల మధ్య ఆసక్తికర పోరు

దరఖాస్తు విధానం:

ఆన్‌లైన్ విధానంలో అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

దరఖాస్తు ఫీజు:

దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు జనరల్, OBC, EWS కేటగిరీకి దరఖాస్తు ఫీజు రూ. 800 చెల్లించాలి. షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగలు రూ.600 దరఖాస్తు ఫీజు చెల్లించాలి. దరఖాస్తుదారు ఫీజులను ఆన్‌లైన్ మోడ్ లో చెల్లించాలి.

READ ALSO : AIESL Recruitment 2023 : ఏఐఈఎస్‌ఎల్‌లో ఫైనాన్స్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల భర్తీ.. సమీపిస్తున్న దరఖాస్తు గడువు

జీతం:

ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 36,000 నుండి 1,00,000 వేతనం చెల్లిస్తారు.

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://centralbankofindia.co.in/ పరిశీలించగలరు.