Central Coal Fields Limited (CCL) Ranchi
Ccl Ranchi Apprenticeship : భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన సెంట్రల్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ (సీసీఎల్ ) రాంచిలో అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఐటీఐ పూర్తి చేసిన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 635 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో ట్రేడ్ అప్రెంటిస్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, డీజిల్ మెకానిక్, మెషినిస్ట్, టర్నర్, సెక్రటరేయల్ అసిస్టెంట్, అకౌంటెంట్, డ్రెస్సర్, వైర్ మ్యాన్, సర్వేయర్, ఎలక్ట్రానిక్ మెకానిక్, వెబ్ పేజ్ డిజైన్, వెల్డర్ వంటి పోస్టులు ఉన్నాయి.
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు అప్రెంటిస్ పోస్టు ఆధారంగా పదో తరగతితో పాటు సంబంధిత స్పెషలైజేషన్‌లో ఐటీఐ లేదా ఇంటర్ పూర్తి చేసి ఉండాలి. ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులకు 18 నుంచి 27 ఏళ్లలోపు, ఫ్రెషర్ అప్రెంటిస్ పోస్టులకు 18 నుంచి 21 ఏళ్లు ఉండాలి. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మార్కుల ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. దరఖాస్తుల స్వీకరణకు 10-10-2022ని చివరి తేదీగా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://www.centralcoalfields.in/ పరిశీలించగలరు.