అప్లై చేసుకోండి : కోల్ ఇండియాలో ఉద్యోగాలు

భారత కేంద్ర ప్రభుత్వ బొగ్గు గనుల మంత్రిత్వ శాఖకు చెందిన కోల్ ఇండియా లిమిటెడ్ లో మేనేజ్ మెంట్ ట్రెనీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మెుత్తం 1326 పోస్టులు ఉన్నాయి. విభాగాల వారీగా ఖాళీలను భర్తీ చేయనుంది. ఆసక్తి గల అభ్యర్ధులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
విభాగాల వారీగా ఖాళీలు :
మైనింగ్ – 288
ఎలక్ట్రికల్ – 218
మెకానికల్ – 258
సివిల్ – 68
కోల్ ప్రిపరేషన్ – 28
సిస్టమ్స్ – 46
మెటిరియల్స్ మేనేజ్ మెంట్ – 28
ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ – 254
పర్సనల్ అండ్ హెచ్ ఆర్ – 89
మార్కెటింగ్ అండ్ సేల్స్ – 23
కమ్యూనిటీ డెవలప్ మెంట్ – 26
విద్యార్హత :
విభాగాల వారీగా పోస్టుల విద్యార్హతలు నిర్ణయించబడినవి. అభ్యర్ధులు 60 శాతం మార్కులతో బీఈ, బీటెక్,బీఎస్సీ(ఇంజనీరింగ్), సీఏ, ఐసీడబ్ల్యూఏ, ఎంబీఏ, పీజీ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
దరఖాస్తు ఫీజు : జనరల్, ఓబీసీ, EWS అభ్యర్ధులు రూ.1000 చెల్లించాలి. SC,ST, దివ్యాంగులకు మాత్రం ఫీజు నుంచి మినహాయింపు వర్తిస్తుంది.
ఎంపిక విధానం : అభ్యర్దులను కంప్యూటర్ బేస్ టెస్ట్, ఇంటర్వూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
వయోపరిమితి : అభ్యర్ధులకు వయస్సు 30 సంవత్సరాలలోపు ఉండాలి.
ముఖ్య తేదిలు :
దరఖాస్తు ప్రారంభ తేది : డిసెంబర్ 21,2019
దరఖాస్తు చివరి తేది : జనవరి 19,2020
దరఖాస్తు ఫీజు చెల్లింపునకు చివరి తేది : జనవరి 19,2020
పరీక్ష తేదిలు : ఫిబ్రవరి 27,2020 – ఫిబ్రవరి 28,2020