SSC GD Constable Recruitment
Recruitment of Constables : కేంద్ర సాయుధ బలగాలైన బీఎన్‌ఎఫ్, సీఐఎస్‌ఎఫ్, నీఆర్‌పీఎఫ్, ఐటీబీపీ, ఎన్‌ఎన్‌బీ, ఎన్‌ఎన్‌ఎఫ్‌లో కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ చేపట్టనున్నారు. త్వరలో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ జారీకానుంది. దేశ వ్యాప్తంగా సుమారుగా 75 వేల కానిస్టేబుల్ గ్రౌండ్ డ్యూటీ ఖాళీలు భర్తీచేయనున్నారు. ఎస్ఎస్ సీ వార్షిక క్యాలెండర్ ప్రకారం నవంబర్ 24న నోటిఫికేషన్ వెలువడనుంది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధులు దరఖాస్తుచేసుకోవచ్చు.
READ ALSO : Uttarakhand : ఏడు రోజులుగా కూలిపోయిన సొరంగంలోనే 41 మంది కార్మికులు.. కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
అర్హత ;
పదో తరగతి విద్యార్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు.
వయస్సు ;
వయో పరిమితి 18-28 ఏళ్ల మధ్య ఉండాలి.
READ ALSO : Miss Universe 2023 : మిస్ యూనివర్స్ 2023గా నికరాగ్వా సుందరి షెన్నిస్ పలాసియోస్
పోస్టుల వివరాలు :
అస్సాం రైఫిల్స్‌లో రైఫిల్‌మ్యాన్ (జనరల్ డ్యూటీ), ఎన్‌సీబీలో సిపాయి పోస్టులు భర్తీ చేయనున్నారు.
దరఖాస్తు ప్రక్రియ ;
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ డిసెంబర్ 28 ఆఖరు తేదిగా నిర్ణయించారు. పరీక్ష షెడ్యూల్‌ను విడుదల చేసింది. కానిస్టేబుల్(గ్రౌండ్ డ్యూటీ) రాత పరీక్షలు వచ్చే ఏడాది ఫిబ్రవరి 20, 21, 22 23 24 26 27,28 29 మార్చి 1, 5, 6, 7 11, 12వ తేదీల్లో జరగనున్నాయి. దేశవ్యాప్తంగా ప్రధాన కేంద్రాల్లో ఈ పరిక్ష జరుగుతుంది.
READ ALSO : NTR Coins : రికార్డు స్థాయిలో ఎన్టీఆర్ స్మారక నాణేల విక్రయం
ఎంపిక ;
రాత పరీక్ష ఫిజికల్ ఎఫిషియెన్సీ టెన్ట్ ఫిజికల్ స్టాండర్డ్ టెన్ట్ వైద్య పరీక్షలు, ధ్రువపత్రాల పరిశీలన, రిజర్వేషన్ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
వేతనం ;
ప్రారంభ వేతనంరూ.18,000- రూ.56,800 ఉంటుంది.
READ ALSO : Barrelakka Sirisha : కొల్లాపూర్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న బర్రెలక్క
ఉచిత శిక్షణ, భోజనం, స్టడీ మెటీరియల్
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ చేపట్టే కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) ఉద్యోగాల భర్తీ ప్రక్రియకు సన్నధ్ధమౌతున్న అభ్యర్ధులకు పరవస్తు క్రియేటివ్ ఫౌండేషన్, రామ్‌కీ ఫౌండేషన్ ఉచిత శిక్షణ ఇవ్వనున్నాయి. అర్హులైన యువతకు హైదరాబాద్, గుంటూరులో ఆయా ఫౌండేషన్‌లు ఉచిత శిక్షణకోసం నవంబరు 28న ప్రవేశ పరీక్ష నిర్వహించి, 29న ఫలితాలు వెల్లడిస్తాయి. ఇందులో అర్హత సాధించిన 600 మంది అభ్యర్థులకు డిసెంబరు 2 నుంచి అయిదు నెలల పాటు శిక్షణ ఇస్తారు. శిక్షణకాలంలో వసతి, భోజనం, స్టడీ మెటీరియల్ ఉచితంగా ఇస్తారు. వివరాలకు 9703651233, 733585959, 9000797789 సంప్రదించవచ్చు.