Uttarakhand : ఏడు రోజులుగా కూలిపోయిన సొరంగంలోనే 41 మంది కార్మికులు.. కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
సొరంగం కూలిపోవడంతో ఏడు రోజులుగా శిథిలాల కింద చిక్కుకుపోయిన 41 మంది నిర్మాణ కార్మికులను బయటకు తీసుకురావడానికి రెస్క్యూ టీమ్‌లు పోరాడుతున్నాయి.

Uttarakhand tunnel collapsed
Uttarakhand Tunnel Collapsed : ఉత్తరాఖండ్‌లో సొరంగం కూలిపోయిన విషయం తెలిసిందే. ఉత్తరకాశీలో సొరంగంలో చిక్కుకుపోయి కార్మికుల కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతూనేవుంది. సొరంగం కూలిపోవడంతో ఏడు రోజులుగా శిథిలాల కింద చిక్కుకుపోయిన 41 మంది నిర్మాణ కార్మికులను బయటకు తీసుకురావడానికి రెస్క్యూ టీమ్‌లు పోరాడుతున్నాయి. సొరంగం లోపల ఏడు రోజులుగా కార్మికులు ఉండటంతో ఆరోగ్యం, ప్రాణాలపై తీవ్ర ఆందోళన నెలకొంది.
కార్మికులు చిక్కుకుపోయిన సొరంగం కొండపై నుండి నిలువు రంధ్రం వేయడానికి అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నుండి హై-పెర్ఫార్మెన్స్ డ్రిల్లింగ్ మెషీన్‌ను ఘటనా స్థలానికి తీసుకువచ్చిన తర్వాత నిలువు రంధ్రం ప్రారంభించడానికి ప్లాట్‌ఫారమ్‌ను నిర్మించే పని నిన్న సాయంత్రం ప్రారంభమైంది.
సొరంగంలో చిక్కుకుపోయిన 41 మంది కార్మికులను రక్షించడానికి ప్రధానమంత్రి కార్యాలయ అధికారుల బృందం, ఘటనాస్థలంలోని నిపుణులు ఐదు ప్రణాళికలతో ఏకకాలంలో పని చేస్తున్నారు. సొరంగంలో చిక్కుకుపోయిన కార్మికులను వీలైనంత త్వరగా చేరుకోవడానికి ఒక్క ప్లాన్‌పైనే పని చేయకుండా ఐదు ప్రణాళికలపై ఒకేసారి పని చేయాలని నిపుణులు యోచిస్తున్నారని ప్రధానమంత్రి మాజీ సలహాదారు భాస్కర్ ఖుల్బే అన్నారు.
ఏజెన్సీల సమిష్టి కృషితో నాలుగు – ఐదు రోజుల్లో కార్మికులను రక్షించే అవకాశం ఉందని ఖుల్బే తెలిపారు. శుక్రవారం సాయంత్రం డ్రిల్లింగ్ యంత్రం నుంచి అకస్మాత్తుగా పగిలిన శబ్దం రావడంతో అధికారులు డ్రిల్లింగ్‌ను నిలిపివేశారు. ఈ ఘటనపై కేంద్రం ఒక ఉన్నత స్థాయి సమావేశాన్ని కూడా నిర్వహించింది.
IND vs AUS : నేడు వన్డే వరల్డ్ కప్ ఫైనల్ ఫైట్.. అహ్మదాబాద్ వేదికగా భారత్- ఆస్ట్రేలియా ఢీ
కార్మికులను రక్షించడానికి ఐదు మార్గాల్లో పని చేయడానికి నిర్దిష్ట ప్రత్యామ్నాయాలతో కేటాయించిన వివిధ ఏజెన్సీలతో చర్చించినట్లు తెలుస్తోంది. అన్ని కేంద్ర సంస్థలను సమన్వయం చేసేందుకు ఎన్ హెచ్ఐడీసీఎల్ ఎండీ మహమూద్ అహ్మదాస్ ఇన్‌ఛార్జ్‌గా నియమించారు. సొరంగం వెలుపల కార్మికుల కుటుంబాలు తీవ్ర మనోవేదనతో నిరీక్షిస్తున్నారు.
కొంతమంది కార్మికులతో కుటుంబ సభ్యులు చెప్పారు. సొరంగంలో చిక్కుకున్న కార్మికులకు సమగ్ర పునరావాసం అవసరమని వైద్యులు స్పష్టం చేశారు. ఆదివారం ఉదయం సొరంగంలో 41 మంది కార్మికులు చిక్కుకున్నారు. కార్మికులందరూ సురక్షితంగా ఉన్నారని అధికారులు తెలిపారు. డ్రిల్ చేసిన స్టీల్ పైపుల ద్వారా కార్మికులకు ఆహారం, నీటిని సరఫరా చేస్తున్నట్లు పేర్కొన్నారు.