IND vs AUS : నేడు వన్డే వరల్డ్ కప్ ఫైనల్ ఫైట్.. అహ్మదాబాద్ వేదికగా భారత్- ఆస్ట్రేలియా ఢీ

రివేంజ్ తీర్చుకోవాలని టీమిండియా పట్టుదలతో ఉంది. ఇప్పటివరకు 8 సార్లు వరల్డ్ కప్ ఫైనల్ కు చేరిన ఆసిస్ ఐదు సార్లు విజేతగా నిలిచింది. భారత్ రెండు సార్లు విశ్వవిజేతగా గెలిచింది.

IND vs AUS : నేడు వన్డే వరల్డ్ కప్ ఫైనల్ ఫైట్.. అహ్మదాబాద్ వేదికగా భారత్- ఆస్ట్రేలియా ఢీ

Cricket World Cup final

Updated On : November 19, 2023 / 8:31 AM IST

Cricket World Cup 2023 – IND vs AUS : యావత్తు ప్రపంచమంతా ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. మరికొద్ది గంటల్లో వన్డే వరల్డ్ కప్ గ్రాండ్ ఫినాలే ప్రారంభం కానుంది. అహ్మదాబాద్ వేదికంగా భారత్, ఆస్ట్రేలియా జట్లు ఫైనల్ ఫైట్ లో తలపడనున్నాయి. బిగ్ సండే, బిగ్ ఫైట్ కావడం క్రికెట్ ఫ్యాన్స్ కు ఇక పండగే. ఇప్పటికే క్రికెట్ వన్డే వరల్డ్ కప్ గ్రాండ్ ఫినాలేకు అంతా సిద్ధమైంది. నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియం వెలుగులతో వెలిగిపోతోంది.

యావత్తు క్రికెట్ దునియా ఇప్పుడు గుజరాత్ వైపే చేస్తోంది. క్రికెట్ ఫ్యాన్స్ కు అహ్మదాబాద్ కలర్ ఫుల్ గా వెల్ కమ్ చెబుతోంది. దాదాపుగా రెండు దశాబ్ధాలుగా అంటే 2003లో చివరి సారిగా భారత్, ఆస్ట్రేలియా వన్డే వరల్డ్ కప్ ఫైనల్ లో పోటీ పడ్డాయి. ఆ సమయంలో టీమిండియాపై ఆస్ట్రేలియా ఘన విజయం సాధించి కప్ ఎగరవేసుకు పోయింది. దానికి ప్రతీకారం తీర్చుకునేందుకు భారత్ జట్టుకు ఇప్పుడు సమయం వచ్చింది. రివేంజ్ తీర్చుకోవాలని టీమిండియా పట్టుదలతో ఉంది.

ICC World Cup 2023 : ఐసీసీ ప్రపంచ కప్ విజేతకు కనకవర్షమే

ఇప్పటివరకు 8 సార్లు వరల్డ్ కప్ ఫైనల్ కు చేరిన ఆసిస్ ఐదు సార్లు విజేతగా నిలిచింది. భారత్ రెండు సార్లు విశ్వవిజేతగా గెలిచింది. ఈ సారి ముచ్చటగా మూడో సారి ప్రపంచకప్ ను భారత్ ముద్దాడే సమయం ఆసన్నమైంది. కంగారులతో ఖతర్నాక్ రణానికి భారత్ సిద్ధమైంది. రోహిత్ సేన మంచి ఫామ్ లో ఉంది. వరల్డ్ కప్ కు ముందు ఇరు జట్లు హాట్ ఫేవరేట్ గా బరిలోకి దిగాయి. కానీ, ఆసిస్ కంటే భారత్ కే ఎక్కువ విజయ అవకాశాలు ఉన్నాయని క్రికెట్ ఎక్స్ పర్ట్స్ చెబుతున్నాయి.

2023 వన్డే వరల్డ్ కప్ లో టీమిండియా మంచి కసి మీద ఉంది. వరల్డ్ కప్ గెలవటమే లక్ష్యంగా ఆటగాళ్లు వరుస విజయాలతో దూసుకెళ్తున్నారు. ఇప్పటివరకు ఆడిన పది మ్యాచ్ ల్లో భారత్ విజయం సాధించింది. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ ఈ రెడింటికీ తోడు ఫీల్డింగ్ కూడా భారత్ కు ప్లస్ అయింది.
భారత్ ఆర్డర్ ఫుల్ ఫామ్ లో ఉంది. రోహిత్, గిల్, కోహ్లీ, శ్రేయస్ అయ్యార్, కేఎల్ రాహుల్, సూర్య కుమరా్ యాదవ్ తిరిగి ఫామ్ లోకి రావడమే కాకుండా ఇప్పటివరకు జరిగిన మ్యాచుల్లో రాణించారు.

India vs Australia Cricket World Cup Final : భారత్-ఆస్ట్రేలియా క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్‌కు భారీ భద్రత

ముఖ్యంగా ఓపెనర్లు రోహిత్, గిల్ మొదటి నుంచి ధాటిగా ఇన్నింగ్స్ ఆరంభించి టీమిండియా గెలుపుకు బాటలు వేస్తున్నారు. ఆది నుంచి రోహిత్ గిల్ ఫాస్ట్ గా ఆడుతూ సిక్సర్లు, ఫోర్లతో పరుగల వరద పారిస్తున్నారు. ఆ తర్వాత కోహ్లీ, శ్రేయస్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ బ్యాట్ కు పని చెప్పుతున్నారు.
కోహ్లీ విరాటపర్వం, శ్రేయస్ గేమ్ ఛేంజర్ గా మారితే టీమిండియాదే ఘన విజయం. ఆల్ రౌండర్ గా జడేజా కూడా అటు బ్యాట్, ఇటు బాల్ తో తన వందు సాయాన్ని అందిస్తూవస్తున్నారు.

ఇక బౌలింగ్ లో బూమ్ బూమ్ బూమ్రా వికెట్ల వేట కొనసాగిస్తుంటే, బూమ్రాకు తోడుగా మహ్మద్ షమీ ఇరగదీస్తున్నారు. ఎవరూ ఊహించని రీతిలో బౌలింగ్ చేస్తూ ప్రత్యర్థి ఆటగాళ్లకు వణుకుపుట్టిస్తున్నాడు. సిరాజ్ కూడా జట్టుకు మంచి సపోర్టు ఇస్తున్నారు. ఇక స్పిన్నర్ల విషయానికొస్తే మధ్య మధ్యలో కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజాతో బాల్ తో మ్యాజిక్ చేస్తున్నారు. ఫీల్డింగ్ లో కూడా ఆటగాళ్లు చురుగ్గా
క్యాచ్ లు పడుతున్నారు.

Delhi : వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ రోజున మద్యం షాపులు బంద్..ఎక్కడంటే?

వీటన్నింటికీ తోడు రోహిత్ శర్మ కెప్టెన్సీ టీమిండియాకు వరంగా మారింది. ఎప్పటికప్పుడూ ఫీల్డింగ్ లో మార్పులు చేస్తూ వరుస విజయాలకు బూస్టప్ ఇస్తున్నారు. పది మ్యాచ్ ల్లో కొనసాగిన ఫామ్ గ్రాండ్ ఫినాలేలో కూడా రిపీట్ అయితే ముచ్చటగా మూడవ సారి భారత్ వరల్డ్ ఛాంపియన్ గా నిలవడం పెద్ద పనేమీ కాదని క్రికెట్ ఎక్స్ పర్ట్స్ అంటున్నారు. ఇక ఆసిస్ విషయానికొస్తే కంగారులు టీమిండియాతో మొదటి మ్యాచ్ లోనే పరాజయం పాలయ్యారు.

ఓటమితో వరల్డ్ కప్ ను ప్రారంభించిన ఆస్ట్రేలియా ఆ తర్వాత పుంజుకుంది. ఇప్పటివరకు ఆడిన పది మ్యాచుల్లో రెండింటిలో ఓడి పోయింది. సెమీస్ లో కూడా దక్షిణాఫ్రికాపై గెలవడానికి చాలా కష్టపడింది. దక్షిణాఫ్రికా బౌలర్లు కంగారులను ఓ లెవల్ లో కంగారెత్తించారు. కానీ స్కోర్ తక్కువగా ఉండటం, చివర్ల హెడ్ కాస్త దూకుడుగా ఆడి 67 రన్స్ చేయడంతో ఎట్టకేలకు ఆసిస్ లక్ష్యాన్ని చేధించింది.

Rahul Dravid : 2007 నాటి ప్రపంచ కప్ చేదు జ్ఞాపకాలు.. ఈ వరల్డ్ కప్‌ విజయంపైనే ఆశలు.. ద్రవిడ్ కోచ్‌గా కొనసాగుతాడా లేదా?

ఆసిస్ లో వార్నర్, మిచెల్, హెడ్స్, మ్యాక్స్ వెల్ ఫామ్ లో ఉన్నారు. వీరిని తొందరగా టీమిండియా కట్టడి చేస్తే విజయం మనదే. షమీ ఇదే స్పీడ్ కంటిన్యూ చేస్తే కంగారుల జట్టుకు ఇక ఊచకోతే. బౌలింగ్ లో ఆసిస్ ఆటగాళ్లు కమిన్, హేజల్ వుడ్, జంపా రాణిస్తున్నారు. కానీ, ఆసిస్ తో మనవాళ్లకు ఫుల్ ఎక్స్ పీరియన్స్ ఉండటం ఆసిస్ ఫేసర్లను ఎదుర్కొంటే భారత్ కచ్చితంగా గెలుస్తుందని క్రికెట్ అనలిస్టులు అంటున్నారు. అహ్మదాబాద్ లో వరల్డ్ కప్ గ్రాండ్ ఫినాలే మ్యాచ్ జరుగుతుండటంతో టీమిండియాకు ఫుల్ ఎంకరేజ్ మెంట్ ఉంటుంది.

హోమ్ గ్రౌండ్ కావడం రోహిత్ శర్మకు ప్లస్ పాయింట్. బలాబలాలను పోల్చితే వరల్డ్ కప్ లో రాణించే సత్తా ఆసిస్ కంటే టీమిండియాకే ఎక్కువగా ఉందని తెలుస్తోంది. అయితే టాస్ కూడా ఫైనల్ మ్యాచ్ లో చాలా కీలకం. తొలుత టాస్ గెలిస్తే రోహిత్ ఏం నిర్ణయం తీసుకుంటారో చూడాలి. మొత్తం మీద 12 ఏళ్ల తర్వాత వరల్డ్ కప్ ను ముద్దాడేందుకు టీమిండియా ఒక్క అడుగు దూరంలో మాత్రమే ఉంది. సో ఆల్ ద బెస్ట్ టీమిండియా.