ICC World Cup 2023 Final Match : ప్ర‌పంచ‌క‌ప్ ఆస్ట్రేలియాదే.. ఫైన‌ల్‌లో ఓడిన భార‌త్‌

ఫైన‌ల్‌లో టీమ్ఇండియాను ఓడించిన ఆస్ట్రేలియా వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ 2023 విజేత‌గా నిలిచింది.

ICC World Cup 2023 Final Match : ప్ర‌పంచ‌క‌ప్ ఆస్ట్రేలియాదే.. ఫైన‌ల్‌లో ఓడిన భార‌త్‌

ODI World Cup 2023

Updated On : November 19, 2023 / 9:23 PM IST

వ‌న్డే ప్రపంచ‌కప్‌2023లో భాగంగా భార‌త్, ఆస్ట్రేలియా జ‌ట్ల మ‌ధ్య అహ్మ‌దాబాద్‌లోని న‌రేంద్ర‌మోదీ స్టేడియంలో ఫైన‌ల్ మ్యాచ్ జ‌రిగింది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా విజ‌యం సాధించి ఆరోసారి ప్ర‌పంచ‌క‌ప్‌ను ముద్దాడింది.

The liveblog has ended.

LIVE NEWS & UPDATES

  • 19 Nov 2023 09:23 PM (IST)

    ఆస్ట్రేలియా గెలుపు

    241 ప‌రుగుల ల‌క్ష్యాన్ని 43 ఓవ‌ర్ల‌లో నాలుగు వికెట్లు కోల్పోయి ఆసీస్ ఛేదించింది.

  • 19 Nov 2023 08:41 PM (IST)

    ట్రావిస్ హెడ్ సెంచ‌రీ..

    కుల్దీప్ యాద‌వ్ బౌలింగ్‌లో సింగిల్ తీసి 95 బంతుల్లో 14 ఫోర్లు, 1 సిక్స్‌తో ట్రావిస్ హెడ్ సెంచ‌రీ చేశాడు. 34 ఓవ‌ర్ల‌లో ఆస్ట్రేలియా స్కోరు 185/3. లుబ‌షేన్ (41), ట్రావిస్ హెడ్ (100) లు ఆడుతున్నారు.

  • 19 Nov 2023 07:32 PM (IST)

    15 ఓవ‌ర్ల‌కు ఆస్ట్రేలియా స్కోరు 78/3

    ఆసీస్ ఇన్నింగ్స్‌లో 15 ఓవ‌ర్లు పూర్తి అయ్యాయి. మూడు వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా 78 ప‌రుగులు చేసింది. ట్రావిస్ హెడ్ (27), మార్న‌స్ లబుషేన్ (8)లు ఆడుతున్నారు.

  • 19 Nov 2023 07:00 PM (IST)

    స్టీవ్‌స్మిత్ ఎల్బీడ‌బ్ల్యూ..

    బుమ్రా బౌలింగ్‌లో స్టీవ్‌స్మిత్ (4) ఎల్బీడ‌బ్ల్యూగా ఔట్ అయ్యాడు. దీంతో 6.6వ ఓవ‌ర్‌లో 47 ప‌రుగుల వ‌ద్ద ఆస్ట్రేలియా మూడో వికెట్ కోల్పోయింది.

  • 19 Nov 2023 06:49 PM (IST)

    మిచెల్ మార్ష్ ఔట్‌..

    ఆస్ట్రేలియా మ‌రో వికెట్ కోల్పోయింది. బుమ్రా బౌలింగ్‌లో మిచెల్ మార్ష్ (15) కేఎల్ రాహుల్ చేతికి చిక్కాడు. దీంతో 4.3వ ఓవ‌ర్‌లో 41 ప‌రుగుల వ‌ద్ద ఆసీస్ రెండో వికెట్‌ను కోల్పోయింది.

  • 19 Nov 2023 06:33 PM (IST)

    డేవిడ్ వార్న‌ర్ ఔట్‌

    ఓ మోస్త‌రు ల‌క్ష్యాన్ని ఛేదించేందుకు ఆస్ట్రేలియా బ‌రిలోకి దిగింది. మొదటి ఓవ‌ర్‌ను బుమ్రా వేయ‌గా 15 ప‌రుగులు వ‌చ్చాయి. కాగా.. రెండో ఓవ‌ర్‌ను ష‌మీ వేయ‌గా మొద‌టి బంతికి డేవిడ్ వార్న‌ర్ (7) విరాట్ కోహ్లీ క్యాచ్ అందుకోవ‌డంతో ఔట్ అయ్యాడు. దీంతో 1.1వ ఓవ‌ర్‌లో 16 ప‌రుగుల వ‌ద్ద ఆసీస్ మొద‌టి వికెట్ కోల్పోయింది.

  • 19 Nov 2023 05:56 PM (IST)

    ఆస్ట్రేలియా టార్గెట్ 241

    కీల‌క మ్యాచులో భార‌త బ్యాట‌ర్లు విఫ‌లం కావ‌డంతో ఆస్ట్రేలియా ముందు ఓ మోస్త‌రు ల‌క్ష్యం నిలిచింది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ఫీల్డింగ్ ఎంచుకోగా మొద‌ట బ్యాటింగ్ చేసిన భార‌త్ నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో 240 ప‌రుగుల‌కు ఆలౌలైంది. టీమ్ఇండియా బ్యాట‌ర్ల‌లో విరాట్ కోహ్లీ (54; 63 బంతుల్లో 4 ఫోర్లు), కేఎల్ రాహుల్ (66; 107 బంతుల్లో 1 ఫోర్‌) లు హాఫ్ సెంచ‌రీలు చేశారు. రోహిత్ శ‌ర్మ (47; 31 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స‌ర్లు) రాణించాడు. మిగిలిన వారు విఫ‌లం కావ‌డంతో ఓ మోస్త‌రు స్కోరుకే భార‌త్ ప‌రిమిత‌మైంది. ఆస్ట్రేలియా బౌల‌ర్ల‌లో మిచెల్ స్టార్క్ మూడు వికెట్లు తీశాడు. జోష్ హేజిల్‌వుడ్, పాట్ క‌మిన్స్ చెరో రెండు వికెట్లు తీశారు. మాక్స్‌వెల్‌, జంపాలు త‌లా ఓ వికెట్ ప‌డ‌గొట్టారు.

  • 19 Nov 2023 05:42 PM (IST)

    సూర్య‌కుమార్ యాద‌వ్ ఔట్‌..

    హేజిల్‌వుడ్ బౌలింగ్‌లో జోష్ ఇంగ్లిస్ క్యాచ్ అందుకోవ‌డంతో సూర్య‌కుమార్ యాద‌వ్ (18) ఔట్ అయ్యాడు. దీంతో 47.3వ ఓవ‌ర్‌లో 226 ప‌రుగుల వ‌ద్ద భార‌త్ తొమ్మిదో వికెట్ కోల్పోయింది.

  • 19 Nov 2023 05:28 PM (IST)

    బుమ్రా ఔట్‌..

    భార‌త్ వ‌రుస‌గా వికెట్లు కోల్పోతుంది. ఆడ‌మ్ జంపా బౌలింగ్‌లో బుమ్రా (1) ఎల్భీడ‌బ్ల్యూగా ఔట్ అయ్యాడు. దీంతో భార‌త్ 44.5వ ఓవ‌ర్‌లో 214 ప‌రుగుల వ‌ద్ద ఎనిమిదో వికెట్ కోల్పోయింది.

  • 19 Nov 2023 05:23 PM (IST)

    ష‌మీ ఔట్‌..

    మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో జోష్ ఇంగ్లిస్ క్యాచ్ అందుకోవ‌డంతో మ‌హ్మ‌ద్ ష‌మీ (6) ఔట్ అయ్యాడు. దీంతో 43.4వ ఓవ‌ర్‌లో 211 ప‌రుగుల వ‌ద్ద భార‌త్ ఏడో వికెట్ కోల్పోయింది.

  • 19 Nov 2023 05:12 PM (IST)

    కేఎల్ రాహుల్ ఔట్‌.. 

    భార‌త్ మ‌రో వికెట్ కోల్పోయింది. మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో జోష్ ఇంగ్లిస్ క్యాచ్ అందుకోవ‌డంతో కేఎల్ రాహుల్ (66; 107 బంతుల్లో 1 ఫోర్‌) ఔట్ అయ్యాడు. దీంతో 41.3వ ఓవ‌ర్‌లో 203 ప‌రుగుల వ‌ద్ద భార‌త్ ఆరో వికెట్ కోల్పోయింది.

  • 19 Nov 2023 04:45 PM (IST)

    జ‌డేజా ఔట్‌..

    హేజిల్‌వుడ్ బౌలింగ్‌లో జోష్ ఇంగ్లిస్ క్యాచ్ అందుకోవ‌డంతో ర‌వీంద్ర జ‌డేజా (9) ఔట్ అయ్యాడు. దీంతో 35.5వ ఓవ‌ర్‌లో 178 ప‌రుగుల వ‌ద్ద భార‌త్ ఐదో వికెట్ కోల్పోయింది.

  • 19 Nov 2023 04:40 PM (IST)

    కేఎల్ రాహుల్ అర్ధ‌శ‌త‌కం

    మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో సింగిల్ తీసి కేఎల్ రాహుల్ 86 బంతుల్లో అర్ధశ‌త‌కాన్ని పూర్తి చేసుకున్నాడు. 35 ఓవ‌ర్ల‌కు భార‌త స్కోరు 173 4. కేఎల్ రాహుల్ (50), ర‌వీంద్ర జ‌డేజా (9) లు ఆడుతున్నారు.

  • 19 Nov 2023 04:10 PM (IST)

    విరాట్ కోహ్లీ ఔట్‌..

    క‌మిన్స్ బౌలింగ్‌లో విరాట్ కోహ్లీ (54; 63 బంతుల్లో 4 ఫోర్లు) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో భార‌త్ 28.3 ఓవ‌ర్‌లో 148 ప‌రుగుల వ‌ద్ద నాలుగో వికెట్ కోల్పోయింది.

  • 19 Nov 2023 03:58 PM (IST)

    విరాట్ కోహ్లీ హాఫ్ సెంచ‌రీ

    ఆడ‌మ్ జంపా బౌలింగ్‌లో సింగిల్ తీసి 56 బంతుల్లో విరాట్ కోహ్లీ హాఫ్ సెంచ‌రీ పూర్తి చేసుకున్నాడు. 26 ఓవ‌ర్ల‌కు భార‌త స్కోరు 135/3. విరాట్ కోహ్లీ (50), కేఎల్ రాహుల్ (28) లు ఆడుతున్నారు.

  • 19 Nov 2023 03:36 PM (IST)

    20 ఓవ‌ర్ల‌కు భార‌త స్కోరు 115/3

    భార‌త ఇన్నింగ్స్‌లో 20 ఓవ‌ర్లు పూర్తి అయ్యాయి. మూడు వికెట్లు కోల్పోయిన టీమ్ఇండియా 115 ప‌రుగులు చేసింది. విరాట్ కోహ్లీ (39), కేఎల్ రాహుల్ (19) లు ఆడుతున్నారు.

  • 19 Nov 2023 02:51 PM (IST)

    శ్రేయ‌స్ అయ్య‌ర్ ఔట్‌..

    భార‌త్ మ‌రో వికెట్ కోల్పోయింది. శ్రేయ‌స్ అయ్య‌ర్ (4) పాట్ క‌మిన్స్ బౌలింగ్‌లో జోష్ ఇంగ్లిస్ క్యాచ్ అందుకోవ‌డంతో ఔట్ అయ్యాడు. దీంతో 10.2వ ఓవ‌ర్‌లో 81 ప‌రుగుల వ‌ద్ద భార‌త్ మూడో వికెట్ కోల్పోయింది.

  • 19 Nov 2023 02:46 PM (IST)

    రోహిత్ శ‌ర్మ ఔట్‌..

    భార‌త్ మ‌రో వికెట్ కోల్పోయింది. దూకుడుగా ఆడుతున్న రోహిత్ శ‌ర్మ (47; 31 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స‌ర్లు) గ్లెన్‌మాక్స్‌వెల్ బౌలింగ్‌లో హెడ్‌ అద్భుత క్యాచ్ అందుకోవ‌డంతో ఔట్ అయ్యాడు. దీంతో 9.4వ ఓవ‌ర్‌లో 76 ప‌రుగుల వ‌ద్ద భార‌త్ రెండో వికెట్ కోల్పోయింది.

  • 19 Nov 2023 02:23 PM (IST)

    శుభ్‌మ‌న్ గిల్ ఔట్‌

    టీమ్ఇండియాకు మొద‌టి షాక్ త‌గిలింది. మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో ఆడ‌మ్ జంపా క్యాచ్ అందుకోవ‌డంతో శుభ్‌మ‌న్ గిల్ (4) ఔట్ అయ్యాడు. దీంతో 4.2వ ఓవ‌ర్‌లో 30 ప‌రుగుల వ‌ద్ద భార‌త్ మొద‌టి వికెట్ కోల్పోయింది.

  • 19 Nov 2023 02:16 PM (IST)

    3 ఓవ‌ర్ల‌కు భార‌త స్కోరు 18/0

    టాస్ ఓడిపోవ‌డంతో భార‌త జ‌ట్టు బ్యాటింగ్‌కు దిగింది. ఓపెన‌ర్లుగా రోహిత్ శ‌ర్మ‌, శుభ్‌మ‌న్ గిల్‌లు వ‌చ్చారు. వీరిద్ద‌రు ఆచితూచి ఆడుతున్నారు. 3 ఓవ‌ర్ల‌కు భార‌త స్కోరు 18/0. రోహిత్ శ‌ర్మ (14), శుభ్‌మ‌న్ గిల్ (3)లు ఆడుతున్నారు.

  • 19 Nov 2023 01:39 PM (IST)

    ఆస్ట్రేలియా తుది జ‌ట్టు

    ట్రావిస్ హెడ్, డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, స్టీవెన్ స్మిత్, మార్నస్ లాబుషాగ్నే, గ్లెన్ మాక్స్‌వెల్, జోష్ ఇంగ్లిస్(వికెట్ కీప‌ర్‌), మిచెల్ స్టార్క్, పాట్ కమిన్స్(కెప్టెన్‌), ఆడమ్ జంపా, జోష్ హేజిల్‌వుడ్.

  • 19 Nov 2023 01:39 PM (IST)

    టీమ్ఇండియా తుది జ‌ట్టు

    రోహిత్ శర్మ(కెప్టెన్‌), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్(వికెట్ కీప‌ర్‌), సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్

  • 19 Nov 2023 01:35 PM (IST)

    టాస్..

    వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ 2023 టోర్నీ విజేత‌గా నిలిచేందుకు సువ‌ర్ణావ‌కాశం. ముచ్చ‌ట‌గా మూడో సారి క‌ప్‌ను ముద్దాడాల‌ని భార‌త్ భావిస్తోండ‌గా ఆరో సారి క‌ప్‌ను సొంతం చేసుకుని త‌మ‌కు తిరుగులేద‌ని నిరూపించుకోవాల‌ని ఆస్ట్రేలియా ప‌ట్టుద‌ల‌గా ఉంది. ఈ క్ర‌మంలో అహ్మ‌దాబాద్‌లోని న‌రేంద్ర మోదీ స్టేడియంలో జ‌రుగుతున్న ఫైన‌ల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో భార‌త్ మొద‌ట బ్యాటింగ్ చేయ‌నుంది.

  • 19 Nov 2023 11:52 AM (IST)

    2003 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా ఓడిపోయింది. 1983, 2011లో భారత్ వరల్డ్ కప్ నెగ్గింది. ఈ వరల్డ్ కప్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఓడకుండా టీమిండియా  ఫైనల్స్‌కి చేరుకుంది.

  • 19 Nov 2023 11:49 AM (IST)

  • 19 Nov 2023 11:48 AM (IST)

    భారత్ గెలవాలని దేశవ్యాప్తంగా అభిమానుల పూజలు నిర్వహిస్తున్నారు. మ్యాచ్ ను వీక్షించేందుకు ఇప్పటికే పలువురు ప్రముఖులు అహ్మదాబాద్ స్టేడియం వద్దకు చేరుకున్నారు.

  • 19 Nov 2023 11:47 AM (IST)

    నరేంద్ర మోదీ మైదానంలో ప్రత్యక్షంగా 1.3 లక్షల మంది మ్యాచ్ వీక్షించే అవకాశం ఉంది.

  • 19 Nov 2023 11:45 AM (IST)

    తొలి ఇన్నింగ్స్ డ్రింక్స్ విరామంలో ఆదిత్య గద్వీ కార్యక్రమం. ఇన్నింగ్స్ విరామంలో ప్రీతమ్, జోనితా నేతృత్వంలో సాంస్కృతి కార్యక్రమాలు ఉంటాయి. రెండో ఇన్నింగ్స్ డ్రింక్స్ విరామం సమయంలో లేజర్, లైట్ షో.

  • 19 Nov 2023 11:43 AM (IST)

    వన్డే వరల్డ్ కప్-2023 ఫైనల్ మ్యాచ్‌కు ముందు స్టేడియం పై వాయుసేనల ఎయిర్ షో నిర్వహించనుంది. సూర్యకిరణ్ నేతృత్వంలో వైమానిక దళ విన్యాసాలు చేయనుంది.

  • 19 Nov 2023 11:41 AM (IST)

    ఫైనల్ మ్యాచ్ జరిగే నరేంద్ర మోదీ స్టేడియం వద్దకు క్రికెట్ అభిమానులు భారీగా తరలివచ్చారు.

  • 19 Nov 2023 11:39 AM (IST)

    మధ్యాహ్నం 2 గంటలకు అహ్మదాబాద్ వేదికగా భారత్ - ఆస్ట్రేలియా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ప్రారంభమవుతుంది. మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు ప్రధాని మోదీ, ఆస్ట్రేలియా ఉప ప్రధాని రిచర్డ్ మరికొద్ది సేపట్లో అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంకు రానున్నారు.