TG DOST 2025: టీజీ ‘దోస్త్’ స్పెషల్ ఫేజ్ అడ్మిషన్స్.. ఇవాళటినుంచే రిజిస్ట్రేషన్స్.. ముఖ్యమైన తేదీలివే

TG DOST 2025: విద్యా అధికారులు కీలక ప్రకటన చేశారు. మిగిలిన సీట్ల కేటాయింపు కోసం స్పెషల్ ఫేజ్ ప్రవేశాలను జరిపేందుకు షెడ్యూల్ ను ప్రకటించారు.

Council for Higher Education makes official announcement on DOST Special Phase Admissions

తెలంగాణలో డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాల ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే మూడు విడతల కౌన్సెలింగ్ పూర్తి పూర్తవగా.. ఈసారి భారీగా సీట్లు మిగిలిపోయాయి. మొత్తం 64 డిగ్రీ కళాశాలలో అసలు ఒక్క అడ్మిషన్ కూడా జరగకపోవడం విశేషం. తెలంగాణ వ్యాప్తంగా 4.36 లక్షల డిగ్రీ సీట్లు అందుబాటులో ఉండగా వాటిలో దాదాపు 2.94 లక్షల సీట్లు ఖాళీగానే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఉన్నత విద్యా అధికారులు కీలక ప్రకటన చేశారు. మిగిలిన సీట్ల కేటాయింపు కోసం స్పెషల్ ఫేజ్ ప్రవేశాలను జరిపేందుకు షెడ్యూల్ ను ప్రకటించారు. దీనిని సంబందించిన ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ జులై 25న మొదలై జులై 31తో ముగియనుంది. అయితే దోస్త్’ స్పెషల్ ఫేజ్ రిజిస్ట్రేషన్ కోసం రూ.400 చెల్లించాల్సి ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు ఇవే:

  • జులై 25 నుంచి జులై 31 వరకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ
  • జులై 25 నుంచి జులై 31 వరకు వెబ్ ఆప్షన్ ఎంచుకోవచ్చు
  • ఆగస్టు 3న సీట్ల కేటాయింపు ఉంటుంది.
  • సీట్లు పొందిన అభ్యర్థులు ఆగస్టు 3 నుంచి ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకోవాలి
  • ఆగస్టు 4న కేటాయించిన కాలేజీలో రిపోర్టింగ్ చేసుకోవాలి.
  • రిపోర్టింగ్ చేయకపోతే కేటాయించిన సీటు క్యాన్సిల్ అవుతుంది.

దోస్త్ ఫైనల్ ఫేజ్ కోసం ఇలా రిజిస్ట్రేషన్ చేసుకోండి:

  • విద్యార్థులు ముందుగా దోస్త్ అధికారిక వెబ్ సైట్ dost.cgg.gov.in/welcome.do లోకి వెళ్లాలి.
  • హోం పేజీలో రిజిస్ట్రేషన్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి
  • ఇక్కడ ఇంటర్ హాల్ టికెట్ నెంబర్, పుట్టినతేదీ, ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్ ను ఎంట్రీ చేయాలి.
  • ఆధార్ అతేంటికేషన్ ప్రక్రియ పూర్తి చేయాలి.
  • తర్వాత దోస్త్ ఐడీ జనరేట్ అవుతుంది.
  • దోస్త్ ఐడీ లాగిన్ అవ్వాల్సి ఉంటుంది.
  • తరువాత రిజిస్ట్రేషన్ ఫీజును చెల్లించాలి.
  • దోస్త్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుంది.
  • ఆ తర్వాత వెబ్ ఆప్షన్లు ఎంచుకోవాల్సి ఉంటుంది.
  • సీటు అలాట్మెంట్ కోసం కూడా ఇదే వెబ్ సైట్ లో చెక్ చేసుకోవాలి.