CSIR UGC NET : సీఎస్ఐఆర్ ,యూజీసీ నెట్ దరఖాస్తు గడుపు ఏప్రిల్ 17వరకు పొడగింపు
ఎన్ టీఏ నిర్వహించనున్న ఈ పరీక్ష ద్వారా జేఆర్ ఎఫ్ తోపాటు, లెక్చరర్ షిప్, అసిస్టెంట్ ప్రొఫెసర్ అర్హత పొందవచ్చు. తద్వారా సీఎస్ఐఆర్ పరిధిలోని రిసెర్చ్ సెంటర్లతోపాటు, విశ్వవిద్యాలయాల్లో పీహెచ్ డీకి దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఏర్పడుతుంది.

UGC NET 2023
CSIR UGC NET : నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ జాయింట్ సీఎస్ఐఆర్ యూజీసీ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (నెట్) డిసెంబర్ 2022/జూన్ 2023 దరఖాస్తు గడువును పొడిగిస్తూ ప్రకటన విడుదల చేసింది. వివిధ కారణాల నేపధ్యంలో దరఖాస్తు చేసుకోవటంలో అభ్యర్ధులకు జాప్యం జరిగిన నేపధ్యంలో వారం రోజుల పాటు దరఖాస్తు చేసుకునే గడువును పెంచుతూ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్ణయం తీసుకుంది.
READ ALSO : Keep Your Lungs : కోవిడ్ వ్యాప్తి నేపధ్యంలో మీ ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచుకునే మార్గాలు !
వాస్తవానికి మార్చి 10న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా ఏప్రిల్ 10 తుదిగడువుగా నిర్ణయించిన విషయం విధితమే. ప్రస్తుతం దరఖాస్తు గడువు పొడగింపు నేపధ్యంలో అభ్యర్ధులు ఏప్రిల్ 17వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఏర్పడింది. అదే విధంగా ఏప్రిల్ 19 నుండి 25 వరకు దరఖాస్తులో మార్పులకు సంబంధించిన సవరణలకు అవకాశం కల్పించారు.
ఎన్ టీఏ నిర్వహించనున్న ఈ పరీక్ష ద్వారా జేఆర్ ఎఫ్ తోపాటు, లెక్చరర్ షిప్, అసిస్టెంట్ ప్రొఫెసర్ అర్హత పొందవచ్చు. తద్వారా సీఎస్ఐఆర్ పరిధిలోని రిసెర్చ్ సెంటర్లతోపాటు, విశ్వవిద్యాలయాల్లో పీహెచ్ డీకి దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఏర్పడుతుంది.
READ ALSO : Fenugreek Water : కొవ్వును కరిగించటంతోపాటు, బరువు తగ్గించే మెంతుల నీరు! ఎలా తయారు చేసుకోవాలంటే ?
అంతేకాకుండా యూనివర్శిటీల్లో , డిగ్రీ కాలేజ్ లలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా ఉద్యోగాలు సాధించవచ్చు. నెట్ పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ జూన్ 6,7,8 తేదిలలో నిర్వహించనున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. ఆతేదీలలో ఎలాంటి మార్పు ఉండబోదని స్పష్టం చేసింది.