మార్చి 15 నుంచి ఒంటిపూట బడులు
తెలంగాణలోని అన్ని పాఠశాలలకు మార్చి 15 నుంచి ఒంటి పూట బడులు ప్రారంభం కానున్నాయి.

తెలంగాణలోని అన్ని పాఠశాలలకు మార్చి 15 నుంచి ఒంటి పూట బడులు ప్రారంభం కానున్నాయి.
హైదరాబాద్ : తెలంగాణలోని అన్ని పాఠశాలలకు మార్చి 15 నుంచి ఒంటి పూట బడులు ప్రారంభం కానున్నాయి. ప్రకటించిన తేదీ నుంచి ఒంటి పూట బడులు అమలు చేయాలని పాఠశాల విద్యా డైరెక్టర్ విజయ్ కుమార్.. ఆర్జేడీలు, డీఈవోలను ఆదేశించారు. ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలను ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిర్వహించాలని పేర్కొన్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని అందించాలని తెలిపారు.
అదేవిధంగా హైస్కూల్స్ కు ఆప్షనల్ హాలిడేస్ అమలు చేయాలన్నారు. పాఠశాలలకు చివరి పనిదినం ఏప్రిల్ 12వ తేదీ వరకు ఒంటిపూట బడులను కొనసాగించాలని, ఆ తర్వాత వేసవి సెలవులు వర్తిస్తాయని వెల్లడించారు. తిరిగి జూన్ 1 వ తేదీన రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు ప్రారంభం కానున్నాయి.