DELHI JUDICIAL SERVICE
Delhi Judiciary Exam : ఢిల్లీ హైకోర్టు లో జ్యుడీషియల్ సర్వీస్ ఖాళీల భర్తీకి జ్యుడీషియల్ సర్వీస్ ఎగ్జామినేషన్-2023ను నిర్వహించనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 53 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో జనరల్- 34, ఎస్సీ- 05, ఎస్టీ- 14 పోస్టులు, దివ్యాంగులకు 9 పోస్టులు కేటాయించారు.
READ ALSO : Diwali 2023 : దీపావళి ముహూర్తం .. పండితులు ఏం చెబుతున్నారంటే..?
వయసు, విద్యార్హతలు ;
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి న్యాయవాద వృత్తి ప్రాక్టీస్ చేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. వయోపరిమితి 32 సంవత్సరాలు మించరాదు. నిబంధనల ప్రకారం వయోపరిమితి సడలింపు వర్తిస్తుంది. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు 5సంవత్సరాలు, జనరల్ పీడబ్ల్యూడీ అభ్యర్థులకు 10 సంవత్సరాలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 15సంవత్సరాలు సడలింపు ఉంటుంది.
READ ALSO : Currency Note Press Recruitment : కరెన్సీ నోట్ ప్రెస్‌లో పలు పోస్టుల భర్తీ.. పూర్తి వివరాల కోసం !
దరఖాస్తు, ఎంపిక విధానం ;
దరఖాస్తు ఫీజుగా జనరల్ అభ్యర్థులకు రూ.1500. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రూ.400. అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో ఫీజు చెల్లించవచ్చు. అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రిలిమినరీ పరీక్ష (ఆబ్జెక్టివ్ టైప్), మెయిన్స్(రాతపరీక్ష), వైవా-వోస్ ఆధారంగా అభ్యర్ధుల ఎంపిక ప్రక్రియ ఉంటుంది. ఎంపికైన వారికి వేతనంగా రూ.77840 నుండి 136520 చెల్లిస్తారు.
READ ALSO : CAT 2023 Admit Card : IIM CAT 2023 హాల్ టిక్కెట్లు ఎలా డౌన్ లోడ్ చేయాలో తెలుసా ?
పరీక్షవిధానం:
ఢిల్లీ జ్యుడీషియల్ సర్వీస్ పరీక్ష రెండు దశల్లో ఉంటుంది. ప్రిలిమినరీ పరీక్ష ఆబ్జెక్టివ్ టైప్‌లో జరుగుతుంది. 25% నెగిటివ్ మార్కులతో ఉంటుంది. ప్రిలిమినరీ పరీక్షలో క్వాలిఫై ఐన అభ్యర్థులకు మెయిన్స్ కు అర్హత లభిస్తుంది. మెయిన్స్ రాతపరీక్ష లో క్వాలిఫై అయిన అభ్యర్థులకు వైవా-వోస్ ఉంటుంది. ప్రిలిమినరీ పరీక్షను స్క్రీనింగ్ పరీక్షగా పరిగణిస్తారు. మొత్తం 200 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు తర్వాత దశలో మెయిన్ పరీక్ష నిర్వహిస్తారు. మెయిన్స్ లో అర్హులైనవారికి ఇంటర్వ్యూ నిర్వహించి తుది ఎంపికచేస్తారు.
READ ALSO : Blast by Naxals : ఛత్తీస్‌ఘడ్ సుక్మా జిల్లాలో నక్సల్స్ పేలుడు…సీఆర్‌పీఎఫ్ జవానుకు గాయాలు
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 22.11.2023గా నిర్ణయించారు. ప్రిలిమినరీ పరీక్ష (ఆబ్జెక్టివ్ టైప్) 10.12.2023 తేదిన ఉంటుంది. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://delhihighcourt.nic.in/ పరిశీలించగలరు.