Currency Note Press Recruitment : కరెన్సీ నోట్ ప్రెస్‌లో పలు పోస్టుల భర్తీ.. పూర్తి వివరాల కోసం !
అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 18.11.2023 గా నిర్ణయించారు. ఆన్‌లైన్ పరీక్ష జనవరి/ఫిబ్రవరి 2024 మాసాల్లో ఉంటుంది. ఆసక్తి గల అభ్యర్థులు నోట్ ప్రెస్ అధికారిక వెబ్‌సైట్ cnpnashik.spmcil.com ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

CNP Nashik Recruitment
Currency Note Press Recruitment : మహారాష్ట్ర, నాసిక్‌లోని మినీరత్న కేటగిరీకి చెందిన కరెన్సీ నోట్ల ముద్రణ సంస్థ (Currency Note Press) లో వివిధ పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 117 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అభ్యర్ధుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. భర్తీ చేయనున్న పోస్టుల్లో సూపర్‌వైజర్, టెక్నీషియన్, సెక్రటేరియట్ అసిస్టెంట్ సహా అనేక ఇతర పోస్టులు ఉన్నాయి.
READ ALSO : Diwali 2023 : దీపాలలో ఎన్ని రకాలు ఉన్నాయో తెలుసా..? ఒక్కో పేరుకు ఒకో అర్థం
పోస్టుల వివరాలు ;
జూనియర్ టెక్నీషియన్ – 112 పోస్టులు
ఆర్టిస్ట్ – 1 పోస్ట్
సూపర్‌వైజర్ – 3 పోస్టులు
సెక్రటేరియట్ అసిస్టెంట్- 1 పోస్ట్
READ ALSO : CAT 2023 Admit Card : IIM CAT 2023 హాల్ టిక్కెట్లు ఎలా డౌన్ లోడ్ చేయాలో తెలుసా ?
దరఖాస్తు చేసుకునే వారి అర్హతలు ;
సూపర్‌వైజర్ (టెక్నికల్ ఆపరేషన్-ప్రింటింగ్) పోస్టుకు దరఖాస్తు చేసకునే అభ్యర్ధులు ఇంజినీరింగ్ (ప్రింటింగ్) డిప్లొమా ఫస్ట్ క్లాస్ లో పాసై ఉండాలి. లేదా బీటెక్/బీఈ/బీఎస్సీ ఇంజినీరింగ్ (ప్రింటింగ్) ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థుల వయసు 18-30 సంవత్సరాల మధ్య ఉండాలి.
సూపర్‌వైజర్ (అఫీషియల్ లాంగ్వేజ్) పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు హిందీ లేదా ఇంగ్లిష్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులై ఉండాలి. డిగ్రీ స్థాయిలో హిందీ/ఇంగ్లిష్ సబ్జెక్టుగా చదివి ఉండాలి. హిందీ నుంచి ఇంగ్లిష్‌లోకి, ఇంగ్లిష్ నుంచి హిందీలోకి అనువదించడంలో ఏడాది అనుభవం కలిగి ఉండాలి. సంస్కృత భాషా పరిజ్ఞానం , ఏదైనా ఇతర భాష తెలిసి ఉండాలి. హిందీలో కంప్యూటర్‌పైన టైప్ చేసేవారికి ప్రాధాన్యతనిస్తారు. అభ్యర్థుల వయసు 18-30 సంవత్సరాల మధ్య ఉండాలి.
READ ALSO : Arvind Kejriwal : ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్ట్ చేస్తే ఆప్ ఏం చేయనుందంటే…
ఆర్టిస్ట్ (గ్రాఫిక్ డిజైన్) పోస్టుకు దరఖాస్తు చేసేవారు ఫైనార్ట్స్/విజువల్ ఆర్ట్స్/ఒకేషనల్ (గ్రాఫిక్స్) డిగ్రీ పాసవ్వాలి. గ్రాఫిక్ డిజైన్/కమర్షియల్ ఆర్ట్స్‌లో 55 శాతం మార్కులు సాధించి ఉండాలి.
సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టుకు దరఖాస్తు చేసుకునే వారు 55 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ, ఇంగ్లిష్/హిందీ స్టెనోగ్రఫీ పాసవ్వాలి. ఇంగ్లిష్/హిందీ టైపింగ్, కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి. సెక్రటేరియల్ జాబ్ స్కిల్ ఉన్నవారికి ప్రాధాన్యమిస్తారు. అభ్యర్థుల వయసు 18-28 సంవత్సరాల మధ్య ఉండాలి. ఆన్‌లైన్ పరీక్షతోపాటు స్టెనోగ్రఫీ, టైపింగ్ టెస్ట్ కూడా ఉంటుంది.
READ ALSO : WhatsApp Login : వాట్సాప్ యూజర్లకు గుడ్‌న్యూస్.. ఇకపై ఫోన్ నెంబర్ లేకుండానే లాగిన్ చేయొచ్చు!
జూనియర్ టెక్నీషియన్ (ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, ఫిట్టర్, ఎయిర్ కండిషనింగ్, ప్రింటింగ్/కంట్రోల్) పోస్టుకు దరఖాస్తు చేసకునే వారు సంబంధిత ట్రేడ్‌లో ఎన్‌సీవీటీ/ఎస్‌సీవీటి నుంచి ఫుల్‌టైమ్ ఐటీఐ సర్టిఫికెట్ కలిగి ఉండాలి. వయసు 18-25 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఎంపిక ప్రక్రియ, వేతనం ;
ఆన్‌లైన్ వ్రాత పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అయితే సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టులకు రాత పరీక్షతో పాటు స్టెనోగ్రఫీ పరీక్ష కూడా నిర్వహిస్తారు. ఎంపికైన వారికి సూపర్‌వైజర్ పోస్టుకు రూ.27,600 నుండి 95,910, ఆర్టిస్ట్ పోస్టుకు రూ.23,910 నుండి 85,570, సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టుకు రూ.23,910 నుండి 85,570, జూనియర్ టెక్నీషియన్ పోస్టుకు రూ.18,780 నుండి 67,390 వేతనంగా చెల్లిస్తారు.
అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 18.11.2023 గా నిర్ణయించారు. ఆన్‌లైన్ పరీక్ష జనవరి/ఫిబ్రవరి 2024 మాసాల్లో ఉంటుంది. ఆసక్తి గల అభ్యర్థులు నోట్ ప్రెస్ అధికారిక వెబ్‌సైట్ cnpnashik.spmcil.com ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.