Diwali 2023 : దీపావళి ముహూర్తం .. పండితులు ఏం చెబుతున్నారంటే..?

వెలుగులు విరజిమ్మే దీపావళి చిన్నవారి నుంచి పెద్ద వారి వరకు ఆనందంగా జరుపుకునే ఆనందాల పండుగ. అమావాస్య రోజున వచ్చే ఈ పండుగ అమావాస్య చీకట్లను పారద్రోలి చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా నిలిచే పండుగ.

Diwali 2023 : దీపావళి ముహూర్తం .. పండితులు ఏం చెబుతున్నారంటే..?

Diwali Subha Muhurtam

Diwali 2023: హిందువులు జరుపుకునే పండుగల్లో దీపావళి చాలా చాలా ప్రత్యేకమైనది. ఏ పండుగకు ఆ పండుగే ప్రత్యేకమైనదే అయినా వెలుగులు విరజిమ్మే దీపావళి అంటే.. చిన్నవారి నుంచి పెద్ద వారి వరకు ఆనందంగా జరుపుకునే పండుగ. ఆబాల గోపాలాన్ని అలరించే వెలుగుల పండుగ. అమావాస్య చీకట్లను పారద్రోలి చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా నిలిచే పండుగ. నరకాసురుడి బాధల నుంచి విముక్తి పొందిన పండుగ.

హిందువుల పండుగలు అన్నీ తెలుగు నెలల ప్రకారం తిథులు ప్రకారం జరుపుకుంటారు. ఆయా పండుల ముహూర్తాలు కూడా ఆ తిథులు..ఘడియల్లో జరుపుకోవాల్సి ఉంటుంది. దీపావళి అంటూ దీపాల వేళ చేసుకునే పండుగ. అంటే సాయంత్రం సమయంలో జరుపుకునే పండుగ కాబట్టి సాయంత్రం వేళ ఉండే ముహూర్తంలోనే ఈ పండుగను జరుపుకోవాలి. ఈ ఏడాది రెండు శ్రావణమాసాలు రావటంతో దాదాపు అన్ని పండుగలు జరుపుకునే విషయంలో అయోమయం నెలకొంది.

Diwali 2023 : దీపాలలో ఎన్ని రకాలు ఉన్నాయో తెలుసా..? ఒక్కో పేరుకు ఒకో అర్థం

అమావాస్య తిథి తగులు, మిగులు రావడం వల్లే ఈ అమోయంగా నెలకొంది. నవంబరు 12న అంటే ఆదివారం మధ్యాహ్నం నుంచి అమావాస్య ఘడియలు మొదలయ్యాయి..నవంబరు 13 సోమవారం మధ్యాహ్నం వరకూ అమావాస్య ఘడియలు ఉన్నాయి. హిందువుల పండుగలన్నీ తిథి సూర్యోదయానికి ఉండడమే లెక్క కానీ..దీపావళి అంటే సాయంత్రం లక్ష్మీపూజ చేసి, దీపాలు వెలిగిస్తాం. అంటే అమావాస్య ఘడియలు సాయంత్రానికి ఉన్న రోజునే పరిగణలోకి తీసుకోవాలి. కాబట్టి ఎటువంటి సందేహం లేకుండా దీపావళి నవంబరు 12 ఆదివారం జరుపుకోవాలని పండితులు సూచిస్తున్నారు.

సాధారణంగా దీపావళికి ముందు రోజు నరక అంటే నరకాసుడిని సంహరించిన రోజున అంటే చతుర్థశి తిథి రోజున దీపాలు వెలిగించి దీపావళి జరుపుకుంటారు. ఆశ్వయుజ బహుళ అమవాస్య రోజు దీపాల పండుగ జరుకుంటారు. అంటే ఈ ఏడాది దీపావళి నవంబరు 12 ఆదివారం రోజు వచ్చింది. అయితే నవంబరు 11 శనివారం నరక చతుర్థశి అవుతుందనుకోవద్దు. ఎందుకంటే చతుర్థశి తిథి మాత్రం సూర్యోదయానికి ఉన్నదానినే పరిగణలోకి తీసుకుంటారు. నవంబరు 12 ఆదివారం సూర్యోదయానికి చతుర్థశి తిథి ఉండడంతో..అదే రోజు నరకతచతుర్థశి..సాయంత్రానికి అమావాస్య తిథి రావటం వల్ల అదే రోజు రాత్రి దీపావళి జరుపుకోవాలని పండితులు సూచిస్తున్నారు.

Diwali 2023 : దీపావళి రోజు లక్ష్మీదేవి కటాక్షాన్ని కలిగించే రాళ్ల ఉప్పు ..

సాధారణంగా హిందూ పండుగల్లో పూజలన్నీ ఉదయం పూటే చేస్తారు. కానీ..వెలుగు పంచే దివ్యమైన పండుగ అయిన దీపావళి మాత్రం లక్ష్మీ పూజను సాయంకాలం వేళ చేస్తారు. అంటే ఈ ఏడాది నవంబర్ 12న లక్ష్మీ పూజ చేసుకుని దీపావళి పండుగ జరుపుకోవాలి. దీపావళి పండుగ రోజున లక్ష్మీపూజ చేస్తే..ఇంట్లో సంపద పెరుగుతుందని నమ్ముతారు. ఇంట్లో ఎల్లప్పుడూ లక్ష్మీదేవి నివాసం ఉంటుందని పండితులు చెబుతారు.